వచ్చే నెల వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిలకు ధీటుగా విడుదలయ్యేందుకు వారసుడు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో విజయ్ కు ఎంత వందల కోట్ల మార్కెట్ ఉన్నా ఇక్కడ చిరు బాలయ్యకు పోటీ ఇచ్చే రేంజ్ అయితే ముమ్మాటికీ లేదు. కేవలం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న మూవీగా ట్రేడ్ దీనికి ప్రాధాన్యం ఇవ్వడం తప్పించి ఒకవేళ ఇంకేదైనా కోలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ అయ్యుంటే ఈ మాత్రం ప్రస్తావన కూడా ఉండేది కాదు. థియేటర్ల గొడవా వచ్చేది కాదు. ఈ క్రమంలో విజయ్ కి ఇక్కడ ఇమేజ్ ఉందని నిరూపించే ప్రయత్నాలు తెలుగు రాష్ట్రాల అతని ఫ్యాన్స్ గట్టిగానే చేస్తున్నారు.
అందులో భాగంగా నిన్న సాయంత్రం హైదరాబాద్ సుదర్శన్ 35 ఎంఎంలో మెర్సల్ డబ్బింగ్ వెర్షన్ అదిరిందిని స్పెషల్ షో వేశారు. కారణం ఏంటయ్యా అంటే విజయ్ పరిశ్రమకు వచ్చి మూడు దశాబ్దాలు అంటే ముప్పై సంవత్సరాలు చేరుకున్న సందర్భమట. అది అతనికి మాతృభాషలో మైలురాయి అవుతుంది కానీ ఇక్కడెందుకు సెలబ్రేట్ చేయాలనే ప్రశ్నకు సమాధానం సులభంగానే అర్థం చేసుకోవచ్చు. పోనీ అదిరింది ఏమైనా ఇండస్ట్రీ బ్లాక్ బస్టరా అంటే అదీ లేదు. కమర్షియల్ గా చేసిన తక్కువ బిజినెస్ కి డీసెంట్ గా వర్కవుట్ చేసుకుంది తప్పించి రికార్డులేవీ రాలేదు. చెప్పాలంటే యావరేజ్ కి కొంచెం పైన
ఇంతా చేసి అదిరింది నిన్న ఆదివారం పూట కీలకమైన సాయంత్రం తెచ్చిన కలెక్షన్ కేవలం నలభై వేల నాలుగు వందల ఎనభై రూపాయలు మాత్రమేనట. సిటీలో ఉన్న అరవ తెలుగు అభిమానులందరూ వచ్చినా ఫుల్ అయ్యేది కానీ జరగలేదు. ఇది గ్రాస్. ఇందులో థియేటర్ మైంటెసెన్స్ తీసేస్తే మిగిలే షేర్ ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఇదే క్రాస్ రోడ్స్ లో పోకిరి, వర్షం, జల్సా, బిల్లాలు కిక్కిరిసిపోయి హౌస్ ఫుల్స్ అయ్యాయి. దీన్ని బట్టి విజయ్ కు ఇక్కడ అంత సీన్ లేదని అర్థమవుతోంది. లవ్ టుడేని ఆపేసి మరీ అదిరిందిని స్క్రీనింగ్ వేశారు కానీ లాభం లేకపోయింది.
This post was last modified on December 5, 2022 3:43 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…