ఆర్ఆర్ఆర్ రిలీజై ఎనిమిది నెలలు దాటుతున్నా ఇంకా దాని ప్రమోషన్లలోనే రాజమౌళి ఎందుకు మునిగి తేలుతున్నాడో తెలిసిన విషయమే. ఎట్టి పరిస్థితుల్లో ఆస్కార్ వచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదలకూడదనే ధృడ సంకల్పంతో అది తెచ్చుకునే దాకా నిద్రపోయేలా లేరు. మహేష్ బాబు స్క్రిప్ట్ పనులను తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో పాటు తన బృందానికి ఎప్పుడో అప్పజెప్పిన జక్కన్న ఇటీవలే హైదరాబాద్ కు తిరిగి వచ్చి వాటిని సరిచేసే పనిలో పడ్డారు. అయినా కూడా ట్రిపులార్ కు సంబంధించిన విదేశీ వ్యవహారాల మీద క్రమం తప్పకుండా ఓ కన్నేసి ఉంచుతూనే ఉన్నారు. జపాన్ రిలీజ్ సక్సెస్ కావడానికి కారణం ఇదే
తాజాగా న్యూ యార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఎంపిక కావడం ఆయనకు మరో మైలురాయి. ఇంకే ఇండియన్ మేకర్ కి ఈ గౌరవం దక్కలేదు. ఈ కమిటీ సభ్యులు సూక్ష్మ రీతిలో ఎన్నో అంశాలను కాచి వడపోసిన తర్వాతే బెస్ట్ డైరెక్టర్ ని గుర్తిస్తారు. ఆర్ఆర్ఆర్ ప్రభంజనంతో పాటు అమెరికా తదితర దేశాల్లో ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన, మీడియా ఇచ్చిన రివ్యూ, అందులో ఎమోషన్లకు యాక్షన్ కంటెంట్ కు కనెక్ట్ అయిన తీరు వీటన్నిటికి కూలంకుషంగా అధ్యయనం చేశాకే ఫైనల్ చేశారు. దీన్ని అందుకోవడానికి రాజమౌళి మరోసారి యుఎస్ వెళ్లాల్సి ఉంటుంది.
ఇప్పుడీ ఘనత అవార్డు ఆస్కార్ కు వెళ్లే దారిలో కీలక మలుపనే చెప్పాలి. మన దేశం నుంచి అఫీషియల్ గా వెళ్లలేకపోయిన ఆర్ఆర్ఆర్ జనరల్ క్యాటగిరీలో నామినేషన్లు వేసింది. గుజరాతి చిత్రం లాస్ట్ ఫిలింని ఓవర్ టేక్ చేసి అకాడమీ పురస్కారం అందుకోవడం ద్వారా ఇక్కడి కమిటీ తప్పేంటో ఎత్తి చూపించే ఛాన్స్ కూడా దీని ద్వారా కలుగుతుంది. అందుకే పట్టు వదలకుండా ఇలాగే కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ ఫారినర్స్ నుంచి ఆర్ఆర్ఆర్ ప్రశంసిస్తూ ట్వీట్లు కొనసాగుతూనే ఉన్నాయి. జపాన్ లో ముత్తుని దాటే పనిలో ఉన్న ట్రిపులార్ అతిత్వరలో చైనా వెళ్లనుంది అక్కడేం రికార్డులు రానున్నాయో