అసలు చిన్న నిర్మాతల థియేట్రికల్ స్ట్రాటజీ ఏంటో అంతు చిక్కడం లేదు. అసలివి తీశారని జనానికి తెలియనివి కూడా విపరీతమైన పోటీకి సిద్ధపడటం చూస్తుంటే కనీసం హాలు అద్దెలైనా గిట్టుబాటు అవుతాయానే అనుమానం కలుగుతోంది. వచ్చే వారం డిసెంబర్ 9న స్ట్రెయిట్ అండ్ డబ్బింగ్ కలిపి ఏకంగా 15 దాకా సినిమాలు బాక్సాఫీస్ మీద దాడి చేయబోతున్నాయి. అధిక శాతం జీరో బజ్ తో వస్తున్నవే. ప్రమోషన్లకు అట్టే టైం లేకపోవడంతో వాటిని కనీసం జనం మైండ్ లో రిజిస్టర్ చేయలేక ఊరుకుంటున్న వాళ్లే ఎక్కువ. ఆ రోజు ఉదయం షో క్యాన్సిల్ కాకుండా పడితేనే గొప్పనేలా మరికొన్ని ఉన్నాయి.
సత్యదేవ్ తమన్నాల ‘గుర్తుందా శీతాకాలం’ ఎన్నో పురిటినెప్పుల తర్వాత మోక్షం దక్కించుకుంది కానీ ఎక్స్ ట్రాడినరీ టాక్ వస్తే తప్ప యూత్ దీనివైపు లుక్కేసే ఛాన్స్ లేదు. విఆర్ఎల్ అధినేత బయోపిక్ ‘విజయానంద్’కి కన్నడలో హైప్ ఉంది కానీ ఇక్కడ పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. క్యాస్టింగ్ తో పాటు కంటెంట్ డిఫరెంట్ గా అనిపిస్తున్న ‘పంచతంత్రం’కు పబ్లిసిటీ లోపం ఇబ్బంది పెడుతోంది. ఏపి04 రామాపురం, చెప్పాలని ఉంది, లెహరాయి, నమస్తే సేట్ జీ, రాజయోగం లైన్లో ఉన్నాయి. ఇతర డబ్బింగ్ బొమ్మలు మా ఇష్టం, ఆక్రోశం, సివిల్ ఇంజనీర్, ఐ లవ్ యు మై ఇడియట్, Dr 56 లు ఇలా లిస్టు పెద్దదే ఉంది.
విశ్వక్ సేన్ ప్రత్యేక క్యామియో చేసి కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రచనలో తీసిన ‘ముఖచిత్రం’ హఠాత్తుగా ఇదే డేట్ ని తీసుకుంది. చేతిలో ఉన్న తక్కువ టైంలో ప్రమోషన్ల కోసం టీమ్ పరుగులు పెడుతోంది. ఇవి చాలవన్నట్టు ‘మాయాబజార్ కలర్’ని గ్రాండ్ గా తీసుకొస్తున్నారు. అంతో ఇంతో దీనికే పబ్లిక్ మొగ్గు చూపినా ఆశ్చర్యం లేదు. కొత్త ప్రేమదేశంతో పాటు 96లో వచ్చిన బ్లాక్ బస్టర్ ప్రేమదేశం కూడా రేస్ లో ఉండటం మరో విచిత్రం. చివరి నిమిషంలో ఏమైనా మార్పులు ఉంటే ఇవి దాదాపు వచ్చేస్తాయి. అవతార్ 2కి ఎదురు నిలబడే ధైర్యం చాలక ఇలా కొట్టేసుకోవడానికి రెడీ అయ్యాయి.
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…