కొవిడ్ తర్వాత బాలీవుడ్ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో చూస్తూనే ఉన్నాం. గత వారం వచ్చిన అజయ్ దేవగణ్ సినిమా ‘దృశ్యం-2’ వంద కోట్ల కలెక్షన్లు సాధిస్తే దాన్నో అద్భుతం లాగా మాట్లాడుకుంటున్నారు. ఇండస్ట్రీ అంతటా పండగ వాతావరణం నెలకొంది. కానీ పదేళ్ల ముందే బాలీవుడ్ స్టార్లకు వంద కోట్ల వసూళ్లనేవి కేక్ వాక్ అన్నట్లు ఉండేది. కానీ కొవిడ్ తర్వాత మారిన పరిస్థితుల్లో వంద కోట్ల థియేట్రికల్ రెవెన్యూ కూడా చాలా పెద్ద విషయం అయిపోయింది.
అక్కడ పెద్ద పెద్ద స్టార్ల సినిమాలు కూడా దారుణంగా బోల్తా కొడుతున్న సంగతి తెలిసిందే. ఆమిర్ ఖాన్ లాంటి టాప్ స్టార్‌కు కూడా ‘లాల్ సింగ్ చడ్డా’తో ఘోర పరాభవం ఎదురైంది బాక్సాఫీస్ దగ్గర. ఈ నేపథ్యంలో షారుఖ్ ఖాన్ సినిమా ‘పఠాన్’ ఏమవుతుందా అని అందరూ ఉత్కంఠతో ఉన్నారు. ‘జీరో’ పెద్ద డిజాస్టర్ కావడంతో రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని.. ఆ తర్వాత ‘పఠాన్’ చిత్రాన్ని పట్టాలెక్కించి చాలా జాగ్రత్తగా ఈ సినిమా చేస్తున్నాడు షారుఖ్.
ఈ మధ్యే రిలీజైన ‘పఠాన్’ టీజర్‌కు మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. కొందరు ఈ టీజర్ సూపరన్నప్పటికీ ఇలాంటివి ‘సాహో’లో ఎప్పుడో చూసేశాం.. అయినా ఆ గ్రాఫిక్స్ ఏంటి అంటూ కొందరు కౌంటర్లు వేశారు. ఈ పరిస్థితుల్లో ‘పఠాన్’ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చెప్పలేని పరిస్థితి. ఐతే చిత్ర బృందం మాత్రం ప్రతిసారీ బడ్జెట్, భారీతనం గురించే మాట్లాడుతూ వస్తోంది. ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలిమ్స్ దాదాపు మూడొందల కోట్ల బడ్జెట్లో రూపొందిస్తున్నట్లు సమాచారం.
తాజాగా ఈ చిత్ర యాక్షన్ సన్నివేశాలు 8 దేశాల్లో చిత్రీకరించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. స్పెయిన్, యూఏఈ, టర్కీ, రష్యా, ఇటలీ, సెర్బియా, ఇండియా, ఆఫ్గనిస్థాన్ దేశాల్లో చిత్రీకరించిన భారీ యాక్షన్ ఘట్టాల గురించి స్వయంగా యశ్ రాజ్ ఫిలిమ్స్ ట్విట్టర్ పోస్టు పెట్టింది. ఐతే ఇలా భారీ యాక్షన్ ఘట్టాలు కొత్త కాదు. ఎన్నెన్నో దేశాల్లో చిత్రీకరించడమూ కొత్త కాదు. ‘సాహో’ సహా పలు చిత్రాలు ఈ ఫీట్లు చేశాయి. కేవలం ఈ భారీతనం గురించి బిల్డప్ ఇస్తే జనాలు ఎగబడి పోయే రోజులు పోయాయి. అంతకుమించి సినిమాలో కంటెంట్ ఎంత ఉందన్న దాన్ని బట్టే షారుఖ్ రీఎంట్రీ మూవీ భవితవ్యం తేలుతుంది.
This post was last modified on December 3, 2022 2:59 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…