‘హిట్-2’ థియేటర్లలోకి దిగేసింది. ‘హిట్-3’ విషయంలో సస్పెన్స్ కూడా వీడిపోయింది. కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నట్లే ‘హిట్’ ఫ్రాంఛైజీ మూడో సినిమాలో నేచురల్ స్టార్ నానీనే హీరోగా నటించబోతున్నాడు. కొత్త దర్శకుడైన శైలేష్ కొలనును నమ్మి హిట్ ఫ్రాంఛైజీలో వరుసగా రెండు సినిమాలు నిర్మించిన నాని.. వాటితో కమర్షియల్‌గా మంచి ఫలితాన్నే అందుకున్నాడు. ‘హిట్’ డీసెంట్ హిట్ కాగా.. ‘హిట్-2’కు బంపర్ క్రేజ్ వచ్చింది.
పెట్టుబడి మీద రెట్టింపు ఆదాయం వచ్చేలా ఈ సినిమాకు మంచి బిజినెస్ జరిగింది. ఈ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్‌తో ‘హిట్-3’కి ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు నాని. ఐతే మీడియాలో ప్రచారం జరిగినట్లు నిజంగానే ‘హిట్-3’లో నాని హీరోగా నటిస్తాడా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. ‘హిట్-2’ చివర్లో ఆ సస్పెన్సుకు తెరదించేశారు. రూత్ లెస్ పోలీసాఫీసర్ పాత్రలో నాని సీన్లోకి ఎంట్రీ ఇవ్వడం.. అతను మామూలోడు కాదంటూ పక్కనున్న వాళ్లు బిల్డప్ ఇవ్వడం.. ‘హిట్: ది థర్డ్ కేస్’ అని టైటిల్ పడడం జరిగాయి.
నాని ఎంట్రీతో ‘హిట్-2’ థియేటర్లు హోరెత్తిపోతున్న మాట వాస్తవం. కాకపోతే ఎక్కువగా కెరీర్లో సాఫ్ట్ క్యారెక్టర్లే చేశాడు నాని. పోలీస్ పాత్రలో ఇప్పటిదాకా కనిపించింది లేదు. అలాంటోడు రూత్ లెస్ పోలీసాఫీసర్ పాత్రలో ఎలా మెప్పిస్తాడన్నది ఆసక్తికరం. ‘హిట్-2’కు టాక్ పాజిటివ్‌గానే ఉన్నప్పటికీ.. మరీ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలను సినిమా అందుకోలేకపోయిందనే టాక్ కూడా వినిపిస్తోంది. అంతిమంగా ఈ చిత్రం ఓ మోస్తరు ఫలితంతో సరిపెట్టుకుంటుందా.. చిత్ర బృందం అంచనా వేస్తున్న స్థాయిలో పెద్ద హిట్ అవుతుందా అన్నది కూడా ఆసక్తికరం.
సినిమా రిజల్ట్ అయితే నెగెటివ్‌గా ఉండదు కాబట్టి ‘హిట్-3’ పట్టాలెక్కడం గ్యారెంటీ. కానీ ‘హిట్-2’ మీద కొన్ని నెగెటివ్ కామెంట్లు కూడా పడుతున్న నేపథ్యంలో ఆ సినిమా మరింత మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి. ‘హిట్’ ఫ్రాంఛైజీ సినిమాలంటే ఒక ఫార్మాట్లో నడుస్తాయి అనే అభిప్రాయాన్ని కూడా ఆ చిత్రంతో బ్రేక్ చేయాల్సిందే. కాబట్టి నాని-శైలేష్‌ల ముందు పెద్ద టాస్క్ ఉందనడంలో సందేహం లేదు.
యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల వారసుడు రోషన్ కనకాల నటించిన మోగ్లీకి ఎదురీత తప్పడం లేదు. అఖండ తాండవం…
ఇంకో అయిదు రోజుల్లో అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ విడుదల కాబోతోంది. మాములుగా అయితే ఈపాటికి అడ్వాన్స్ ఫీవర్…
40 % ఓటు బ్యాంకు గత ఎన్నికల్లో వచ్చిందని చెబుతున్న వైసిపికి అదే ఓటు బ్యాంకు నిలబడుతుందా లేదా అన్నది…
ఇంకో ఇరవై నాలుగు రోజుల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. ఒకటి రెండు కాదు స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి ఈసారి ఏకంగా…
అఖండ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో తమన్ మాటలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీలో యూనిటీ లేదని,…
ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అంటూ ఒక పాత పాట ఉంటుంది. ఎన్ని తరాలు మారినా…