అడివి శేష్ అంటే టాలీవుడ్లో ఇప్పుడొక బ్రాండ్. కెరీర్ ఆరంభంలో నటుడిగా, దర్శకుడిగా ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ.. తర్వాత జాగ్రత్తగా అడుగులు వేశాడు. రచయితగా, హీరోగా చాలా మంచి పేరు సంపాదించాడు. క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్ సినిమాలు అతడి రాత మార్చేశాయి.
తన రేంజ్ పెంచేశాయి. శేష్ సినిమా అంటే ఏదో ప్రత్యేకత ఉంటుందని నమ్మి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెద్దదే. తాజాగా ‘హిట్-2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శేష్. ఈ చిత్రానికి డీసెంట్ టాక్ వస్తోంది.
దీని తర్వాత శేష్ చేసే సినిమాల విషయంలో ఆసక్తి నెలకొంది. ఆల్రెడీ తాను అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు సంకేతాలు ఇచ్చాడు శేష్. కానీ దాని దర్శకుడెవరనే విషయంలో క్లారిటీ లేదు. ఇది కాక గూఢచారి-2 కూడా లైన్లో ఉంది.
ఇవి కాక శేష్ ఒక ఇంట్రెస్ట్రింగ్ ప్రాజెక్టు గురించి వెల్లడించాడు. ‘హిట్-2’ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. తాను ఒక ఆస్కార్ విన్నింగ్ మూవీ తెలుగు రీమేక్‌లో నటించనున్నట్లు తెలిపాడు. ఒరిజినల్‌ను నిర్మంచిన హాలీవుడ్ నిర్మాణ సంస్థే ఈ చిత్రాన్ని తెలుగులో ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు శేష్ చెప్పడం విశేషం.
ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతుందని అతను తెలిపాడు. మరి ఆ ఆస్కార్ విన్నింగ్ మూవీ ఏదో.. దాన్ని నిర్మించే ప్రొడక్షన్ హౌస్ ఏదో.. ఈ చిత్రానికి దర్శకుడెవరో చూడాలి. ఆ ఒరిజినల్ ఏదో మన జనాలకు తెలిస్తే దాన్ని చూడడం మొదలుపెడతారనడంలో సందేహం లేదు. ఇక ‘గూఢచారి-2’ గురించి శేష్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు మూల కథ కుదిరిందని.. దాన్ని స్క్రిప్టుగా తీర్చిదిద్దాలని.. తన టీంతో కలిసి ఆ పనిలోనే ఉన్నానని.. సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి టైం పడుతుందని చెప్పాడు.
This post was last modified on December 2, 2022 2:01 pm
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తో కాంగ్రెస్ దోస్తీ…
తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా లోన్ యాప్ల వేధింపుల కారణంగా పలు ఆత్మహత్యలు వెలుగు చూస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం…
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట.. ఈ క్రమంలో రేవతి అనే…
ఏపీ సీఎం చంద్రబాబు సహా కూటమి సర్కారు అమరావతిని పరుగులు పెట్టించేందుకు రెడీ అయింది. ఎక్కువగా కాన్సన్ట్రేషన్ రాజధానిపైనే చేస్తున్నారు.…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…
ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం…