శుక్రవారం రోజు విపరీతంగా పోటీపడే థియేటర్ రిలీజుల గురించి అతి వృష్టి అనా వృష్టి అనుకుంటాంగా ఇప్పుడది ఓటిటికి కూడా వర్తిస్తోంది. ఫ్రైడే వస్తే చాలు నువ్వా నేనా అని పోటీ పడుతూ కంటెంట్ వర్షం కురిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇవాళ డిసెంబర్ 2 వీటి తాకిడి మరీ ఎక్కువగా ఉంది.
బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైన మంచు విష్ణు జిన్నా ప్రైమ్ లో హఠాత్తుగా వచ్చేసింది. ఫ్లాప్ సంగతి పక్కనపెడితే కారణాలు ఏవైనా దీనికి డిజిటల్ లో చూసే ఆడియన్స్ భారీగానే ఉండబోతున్నారు. ఎస్జె సూర్య ప్రధాన పోషించిన వదంది వెబ్ సిరీస్ నిన్న రాత్రి నుంచే స్ట్రీమ్ అవుతోంది. విక్రమ్ వేదా సృష్టికర్తల రచనలో రూపొందింది.
లేటెస్ట్ యూత్ సెన్సేషన్ లవ్ టుడేని నెట్ ఫ్లిక్స్ మొదలుపెట్టేసింది. ప్రస్తుతానికి తమిళ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉన్నా సబ్ టైటిల్స్ తో ఎంజాయ్ చేసే బ్యాచ్ మనదగ్గరా ఉండకపోదు. రష్మిక మందన్న బాలీవుడ్ డెబ్యూ గుడ్ బైని ఇదే ఓటిటిలో చూసుకోవచ్చు.
అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషించారు. ఆ మధ్య రంగస్థలం టైపులో ప్రమోషన్ జరుపుకున్న ధర్మస్థలి ఆహాలో వచ్చేసింది. కేరళలో భారీ అంచనాలతో రిలీజై ఫలితం పరంగా నిరాశపరిచిన మోహన్ లాల్ లేటెస్ట్ మూవీ మాన్స్ టర్ ని తెలుగు ఆడియోతో పాటు మల్టీ లాంగ్వేజెస్ తో హాట్ స్టార్ లో పెట్టేశారు.
కార్తీక్ ఆర్యన్ ఫ్రెడ్డీ మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఇదీ ఈరోజే వచ్చింది. నవీన్ చంద్ర సీనియర్ హీరోయిన్ మధుబాల కాంబోలో రూపొందిన రిపీట్ ఆల్రెడీ అందుబాటులో ఉంది. చప్పుడు లేకుండా వచ్చి అంతే సైలెంట్ గా వెళ్ళిపోయిన ఆకాశంని కూడా చూసుకోవచ్చు.
ఇందులో నోటెడ్ క్యాస్టింగ్ ఉన్నా పబ్లిసిటీ లోపం వల్ల జనానికి చేరలేదు ఇవి కాకుండా ఇతర ఫారిన్ లాంగ్వేజ్ కంటెంట్ చాలానే ఉంది. ఇన్నేసి వస్తే ఓటిటి ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారా. ఏది చూడాలో ఏది వదిలేయాలో అర్థం కాక పూర్తిగా రివ్యూల మీద ఆధారపడాల్సి వస్తోంది. ఇదంతా అతివృష్టే
This post was last modified on December 2, 2022 10:30 am
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…
ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…
షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…