గత పదేళ్లలో సౌత్ ఇండియన్ యూత్‌కు పిచ్చెక్కించేసిన ప్రేమకథా చిత్రాల్లో ‘ప్రేమమ్’ ఒకటి. మలయాళ సినిమాలు వేరే రాష్ట్రాల వారికి పెద్దగా పట్టని సమయంలో విడుదలైన ఈ చిత్రాన్ని దక్షిణాదిన అంతటా ఎగబడి చూశారు. తెలుగులో ఈ చిత్రం రీమేక్ అయి మంచి ఫలితమే అందుకున్నా సరే.. ఒరిజినల్ ఇచ్చిన ఫీలే వేరు. ఈ సినిమాతో కల్ట్ డైరెక్టర్లలో ఒకడైపోయాడు అల్ఫాన్సో పుతెరిన్. అతడి ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.
కానీ ‘ప్రేమమ్’ తర్వాత అతడి తర్వాతి ఫీచర్ ఫిలిం కోసం అభిమానులు ఏడేళ్లు ఎదురు చూడాల్సి రావడం ఆశ్చర్యం కలిగించే విషయం. మధ్యలో ‘అవియల్’ అనే తమిళ ఆంథాలజీ ఫిలింలో ఒక పార్ట్ డైరెక్ట్ చేసిన అల్ఫాన్సో.. ఫుల్ లెంగ్త్ సినిమా తీయడానికి మాత్రం చాలా టైం తీసుకున్నాడు. ఇప్పుడు అతడి నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘గోల్డ్’. మలయాళం టాప్ స్టార్లలో ఒకడైన పృథ్వీరాజ్ సుకుమారన్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన చిత్రమిది.
గురువారమే ‘గోల్డ్’ థియేటర్లలోకి దిగింది. మార్నింగ్ షోల టాక్ చాలా బాగుంది. ఇది అల్ఫాన్సో మార్కు సినిమా అంటున్నారు. టీజర్ తరహాలోనే సినిమా కూడా క్రేజీ క్రేజీగా ఉందని.. వైవిధ్యమైన సినిమాలు చూడాలనుకునేవారికి ఇది మంచి ఛాయిస్ అని అంటున్నారు. ‘గోల్డ్’తో మళ్లీ అల్ఫాన్సో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయబోతున్నాడని అంటున్నారు.
ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. ‘గోల్డ్’ సినిమాను అల్ఫాన్సో రిలీజ్ ముంగిట అసలు ప్రమోట్ చేయలేదు. కనీసం ట్రైలర్ కూడా లాంచ్ చేయకపోవడం గమనార్హం. ఇక ప్రెస్ మీట్లు, ప్రి రిలీజ్ ఈవెంట్ల సంగతి సరేసరి. ఈ సినిమాను అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన ఒక క్రేజీ టీజర్ మినహా ఏ ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయలేదు. ఆ టీజర్ కూడా సినిమా గురించి పెద్దగా ఐడియా ఇచ్చిందేమీ లేదు. ఇక రిలీజ్ ముంగిట ఒక ఇంటర్వ్యూ మాత్రం ఇచ్చాడు అల్ఫాన్సో. అందులో తన ‘నేరమ్’, ‘ప్రేమమ్’ చిత్రాల్లాగే ‘గోల్డ్’ కూడా పర్ఫెక్ట్ కాని సినిమా అని.. కానీ ప్రేక్షకులకు నచ్చుతుందని అన్నాడు. ఇప్పుడు అదే జరుగుతున్నట్లుగా ఉంది.
This post was last modified on December 1, 2022 6:20 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…