హీరోయిన్ అంటే ఎప్పుడూ నాజూగ్గానే ఉండాలన్నది ఒక అప్రకటిత నిబంధన. సినిమాలు మానేసి వ్యక్తిగత జీవితానికి పరిమితం అయినా సరే.. హీరోయిన్లు లావైతే అభిమానులు తట్టుకోలేరు. ఆ హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి అని కామెంట్లు చేస్తారు. అందులోనూ ఈ సోషల్ మీడియా కాలంలో బాడీ షేమింగ్ కామెంట్లు మామూలుగా ఉండవు. ఇక సినిమాల్లో కొనసాగుతుండగా.. హీరోయిన్లు షేప్ అవుట్ అయ్యారంటే అంతే సంగతులు. విపరీతమైన నెగెటివిటీని ఎదుర్కోవాల్సి వస్తుంది.
తాను చాన్నాళ్ల నుంచి అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నానంటూ వాపోయింది మలయాళ హీరోయిన్ మాంజిమా మోహన్. గౌతమ్ మీనన్ మూవీ సాహసం శ్వాసగా సాగిపో చిత్రంలో నాగచైతన్యకు జోడీగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మాంజిమా.. తమిళ సీనియర్ నటుడు కార్తీక్ తనయుడైన గౌతమ్ కార్తీక్‌తో కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉండడం.. ఇటీవలే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడం తెలిసిందే.
పెళ్లి ఫొటోలు చూసినా మాంజిమా కొంచెం బొద్దుగానే కనిపిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ఆమె బాడీ గురించి రకరకాల కామెంట్లు తప్పలేదు. ఐతే సోషల్ మీడియా సంగతి పక్కన పెడితే.. పెళ్లికి వచ్చిన వాళ్లలో కూడా కొందరు తన ఫిజిక్ గురించి కామెంట్లు చేసినట్లు మాంజిమా వెల్లడించడం గమనార్హం.
“నా శరీరాకృతి విషయంలో ఎప్పట్నుంచో విమర్శలు ఎదుర్కొంటున్నా. నిజం చెప్పాలంటే నా పెళ్లిలోనూ కొంతమంది నేను లావుగా ఉన్నానంటూ కామెంట్లు చేశారు. మొదట్లో ఇలాంటి కామెంట్లు విని బాధ పడేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఫిట్‌గా, సంతోషంగానే ఉన్నాను. నాకు బరువు తగ్గాలనిపించినపుడు తప్పకుండా తగ్గుతా” అని మాంజిమా స్పష్టం చేసింది. పెళ్లి తర్వాత కూడా అవకాశాలు వస్తే సినిమాల్లో నటిస్తానని మాంజిమా తెలిపింది. ‘దేవరట్టం’ అనే సినిమాలో కలిసి నటించినపుడు స్నేహితులుగా మారిన గౌతమ్, మాంజిమా ఆ తర్వాత ప్రేమికులుగా మారి.. ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కారు.
This post was last modified on December 1, 2022 2:22 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…