క్రమంగా రీ రిలీజులను అరిగిపోయిన ట్రెండ్ గా మారుస్తున్న పరిస్థితిలో పన్నీటి జల్లులా ఒక నిజమైన క్లాసిక్ మరోసారి థియేటర్లలో అడుగు పెట్టనుంది. టాలీవుడ్ స్క్రీన్ ప్లేకి భగవద్గీతలా భావించే మాయాబజార్ కలర్ వర్షన్ ని ఈ నెల 9న భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఆల్రెడీ హైదరాబాద్ లాంటి నగరాల్లో అడ్వాన్స్ బుకింగ్ మొదలైపోయాయి. 2009లో దీన్ని రీ మాస్టర్ చేసి ఫోర్ కె రెజల్యూషన్ తో పునఃవిడుదల చేసినప్పుడు భారీ స్పందన వచ్చింది. కొంత భాగం కట్ చేయాల్సి వచ్చినా డిటిఎస్ సౌండ్ తో పూర్తి రంగుల్లో చూసిన నిన్న తరం ఇప్పటి జనరేషన్ పులకరించిపోయారు.
ఇప్పుడు మరోసారి దాన్ని ఆవిష్కరించబోతున్నారు. 1957లో వచ్చిన ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక పునఃవిడుదల దక్కించుకున్న చిత్రంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాదు కానీ చాలా దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట దీన్ని ప్రదర్శిస్తూనే ఉండేవారని పెద్దలు కథలుగా చెబుతారు. అసలు పాండవులను చూపించకుండా దర్శకులు కెవి రెడ్డి చేసిన మాయాజాలం, టెక్నాలజీ లేని రోజుల్లో కేవలం ట్రిక్ ఫోటోగ్రఫీ ద్వారా ఛాయాగ్రాహకులు మార్కస్ బాట్లీ ప్రయోగం గురించి ఎన్ని పుస్తకాలు కథనాలు వచ్చాయో చెప్పడం కష్టం.
ఇలాంటి ఆణిముత్యాలు మరిన్ని రావాలి. ఈ మాయ బజారే కాదు జగదేకవీరుని కథ, గుండమ్మ కథ లాంటి మరికొన్ని విజయ అద్భుతాలను కలర్ లో మార్చే ప్లానింగ్ ఉందని చెప్పారు కానీ ఆ తర్వాత ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్ళలేదు. హిందీలోనూ ముఘల్ ఏ అజమ్, నయా దౌర్ తర్వాత ఈ ప్రక్రియ ఆపేశారు. పోనీ రంగులు మార్చకపోయినా ఒరిజినల్ వెర్షన్లను స్క్రీన్ చేసినా వీటి గొప్పదనాన్ని ఇప్పటి యువతకు పరిచయం చేసినట్టు అవుతుంది. అంతే తప్ప అయిదు పదేళ్ల క్రితం వచ్చిన యావరేజ్ సినిమాలను రీ రిలీజ్ పేరుతో థియేటర్లకు తీసుకొస్తే ఆడియన్స్ లో ఆసక్తి తగ్గక ఇంకేమవుతుంది
This post was last modified on December 1, 2022 11:59 am
నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…
ఒక ఇంట్లో దొంగ పడ్డాడు. నగలు, నట్రా దోచుకున్నాడు. యజమాని ... ఆ దొంగను గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.…
టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…
అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది…
తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి చేస్తున్న రాజకీయాలపై ఆసక్తికర…