ఈ ఏడాది ఆరంభంలో ‘డీజే టిల్లు’ సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే గత కొన్నేళ్లలో తెలుగులో వచ్చిన బిగ్గెస్ట్ హిట్లలో ఇదొకటని చెప్పాలి. వసూళ్ల సంగతులు పక్కన పెట్టేస్తే డీజే టిల్లు అనే క్యారెక్టర్ జనాల మీద వేసిన ఇంపాక్ట్ అలాంటిలాంటిది కాదు. షార్ట్స్, రీల్స్‌లో ఈ సినిమా డైలాగులు, పాటలు మామూలుగా హోరెత్తించలేదు. టిల్లు అనే పాత్రకు ఒక కల్ట్ స్టేటస్ వచ్చేసిందనే చెప్పాలి.
వేరే సినిమాలు చేసి ఈ క్రేజ్‌ను డ్రాప్ చేసుకోవడం ఇష్టం లేని సిద్ధు.. తాను అప్పటికే ఓకే చేసిన ప్రాజెక్టులను పక్కన పెట్టి దీని సీక్వెల్ మీదే ఫోకస్ పెట్టాడు. ఈ మధ్యే సినిమాను పట్టాలెక్కించాడు. ఈ చిత్రానికి స్క్రిప్టు సిద్ధుదే కాగా.. దర్శకత్వం మల్లిక్ రామ్ చేస్తున్నాడు. కాగా ‘డీజే టిల్లు’ను డైరెక్ట్ చేసి విమల్ కృష్ణను ఈ సినిమా నుంచి తప్పించడం.. ముందు హీరోయిన్‌గా సెలక్ట్ అయిన శ్రీ లీల, ఆ తర్వాత లైన్లోకి వచ్చిన అనుపమ పరమేశ్వరన్ ఒకరి తర్వాత ఒకరు సినిమా నుంచి వైదొలగడం చర్చనీయాంశం అయింది.
సిద్దు యాటిట్యూడ్ వల్లే వీళ్లు ఒక్కొక్కరిగా తప్పుకోవాల్సి వచ్చిందనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. అనుపమతో అయితే సిద్ధుకు సెట్స్ మీద పెద్ద గొడవ జరిగిపోయిందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారాన్ని ఆల్రెడీ నిర్మాత నాగవంశీ కొంచెం సెటైరికల్ స్టయిల్లో ఖండించాడు. ఇప్పుడు సిద్ధు లైన్లోకి వచ్చాడు. తన గురించి విపరీతమైన వ్యతిరేక ప్రచారం జరిగిపోతుండడంతో ఈ వివాదాలపై క్లారిటీ ఇవ్వాలని అతను డిసైడైనట్లు ఉన్నాడు. బుధవారం సినిమా గురించి అప్‌డేట్ ఇస్తూ ఈ విషయాన్ని వెల్లడించాడు.
‘టిల్లు స్క్వేర్’ షూట్ జోరుగా జరుగుతోందని.. వచ్చే మార్చిలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నామని వెల్లడించిన సిద్ధు.. ఇక ఈ సినిమా గురించి వస్తున్న రూమర్ల గురంచి త్వరలో ఒక ఇంటర్వ్యూ ద్వారా వివరణ ఇవ్వడం జరుగుతుందని కూడా తెలిపాడు. కాబట్టి ఇక ఊహాగానాలకు కట్టి పెట్టి సిద్ధు ఇంటర్వ్యూ కోసం ఎదురు చూడడం బెటర్.
This post was last modified on November 30, 2022 6:02 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి రాప్తాడు పర్యటనపై సాగుతున్న మాటల యుద్ధంలో తాజాగా ఆ పార్టీ…
వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం గురువారం ఎంత రచ్చగా మారిందో… శుక్రవారం కూడా అంతే…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ .. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన మంగళగిరి ఎమ్మెల్యేగా…
26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో కీలక నిందితుడైన తహవ్వుర్ హుస్సేన్ రాణా భారతదేశానికి అప్పగించబడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికాలో అరెస్టై…
ఏపీలోని అన్నమయ్య జిల్లా వెలసిన ఒంటమిట్ల రాములోరికి శుక్రవారం భారీ బంగారు కిరీటాలు విరాళంగా అందాయి. రాములోరితో పాటుగా సీతమ్మ…
"మాది బీసీ పక్షపాత పార్టీ. ఇంకా చెప్పాలంటే.. బీసీల పార్టీ" అని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు వ్యా ఖ్యానించారు.…