దిల్ రాజు ‘బలగం’

Dil Raju
Dil Raju

దిల్ రాజు ప్రొడక్షన్ నుండి వరుసగా చిన్న సినిమాలు రాబోతున్నాయి. ఇప్పటికే ఆ సినిమాలకు సంబంధించి షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. వాటిలో ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్న సినిమా ‘బలగం’.

కమెడియన్ నల్ల వేణు దర్శకత్వంలో దిల్ రాజు ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఓ ఎమోషనల్ మూవీ అని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాకు బలగం అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్ , టీజర్ బయటికి రానున్నాయి.

మల్లేశంతో హీరోగా టర్న్ అయిన ప్రియదర్శి ఇందులో మెయిన్ లీడ్ గా నటిస్తున్నాడు. ఇంకా చాలా కేరెక్టర్స్ ఉన్నాయి. భీమ్స్ మ్యూజిక్ కంపోజర్. ఇందులో మంగ్లీ పాడిన ఓ పాట గురించి మంచి టాక్ వినిపిస్తుంది. కమెడియన్ వేణును దర్శకుడిగా పరిచయం చేస్తూ దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడంటే ఈ ప్రాజెక్ట్ పై ఆయనకు మంచి నమ్మకం ఉండే ఉంటుంది.

దిల్ రాజు బేనర్ నుండి చాలా మంది దర్శకులు పరిచయం అయ్యారు. ఆల్మోస్ట్ అందరూ సక్సెస్ ఫుల్ దర్శకులుగా కొనసాగుతున్నారు. మరి వేణు టిల్లు దశ ఎలా ఉండబోతుందో ? చూడాలి.