ఇంకో పదిహేను రోజుల్లో విడుదల కాబోతున్న అవతార్ 2 ది వే అఫ్ వాటర్ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో వేరే చెప్పనక్కర్లేదు. వారం క్రితమే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టినా పెట్టిన టికెట్లు పెట్టినట్టు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ముఖ్యంగా నగరాలు పట్టణాల్లో యువత పిల్లలు మొదటి రోజే చూడటం కోసం ఎంత ఎగ్జైట్ మెంట్ తో ఉన్నారో చెప్పడం కష్టం. కేవలం తెలుగు తమిళ రాష్ట్రాల నుంచే 150 కోట్ల దాకా వసూళ్లు రావొచ్చనే అంచనాతో ట్రేడ్ వర్గాలు భారీ ఎత్తున స్క్రీన్లను దీని కోసం బ్లాక్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. హిట్ టాక్ వస్తే మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది.
విచిత్రంగా కేరళలో మాత్రం మూవీ లవర్స్ తల్లడిల్లిపోయే పరిణామాలు జరుగుతున్నాయి. అవతార్ 2 ని రిలీజ్ కానివ్వమంటూ FEUOK (ఫిలిం ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజషన్ అఫ్ కేరళ) సదరు పంపిణీదారులకు అల్టిమేటం జారీ చేసింది. కారణం వచ్చే రెవిన్యూలో తమకు 65 శాతం భాగం ఇవ్వాల్సిందేనని మల్లువుడ్ డిస్ట్రిబ్యూటర్లు పట్టు పట్టడం వల్ల. మాములుగా మొదటి వారం ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ పద్ధతిలో ఉంటుంది. అయినప్పటికీ అవతార్ బృందం 55 ఆఫర్ చేసినా ఒప్పుకోవడం లేదట. అది కూడా కనీసం రెండు వారాలు షిఫ్ట్ చేయకుండా నడిపే కండీషన్ మీద అడిగారట. అదీ జరగడం లేదు.
దీని వల్ల ముందస్తుగా అవతార్ 2 కోసం సిద్ధం చేసి ఉంచిన నాలుగు వందల థియేటర్లను ప్రస్తుతానికి బ్లాక్ చేసి పెట్టారు. ఒకవేళ ఓ వారం రోజుల్లో సమస్య పరిష్కారమైతే ఎలాంటి ఇబ్బంది లేదు. కాదూ కూడదంటే కేరళ ఫ్యాన్స్ ఈ విజువల్ వండర్ ని మిస్ అవ్వాల్సి ఉంటుంది. అయినా ఒక విదేశీ నిర్మాణ సంస్థకు ఈ రేంజ్ లో ధమ్కీ ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. సినిమాకున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఎవరూ తమ ప్రయోజనాలు వదులుకునేందుకు సిద్ధంగా లేరు. అసలే ఇలాంటి విషయాల్లో మంకుపట్టు ఎక్కువగా చూపించే కేరళీయులు ఎక్కడ తగ్గుతారో చూడాలి.
This post was last modified on November 30, 2022 10:38 am
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తో కాంగ్రెస్ దోస్తీ…
తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా లోన్ యాప్ల వేధింపుల కారణంగా పలు ఆత్మహత్యలు వెలుగు చూస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం…
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట.. ఈ క్రమంలో రేవతి అనే…
ఏపీ సీఎం చంద్రబాబు సహా కూటమి సర్కారు అమరావతిని పరుగులు పెట్టించేందుకు రెడీ అయింది. ఎక్కువగా కాన్సన్ట్రేషన్ రాజధానిపైనే చేస్తున్నారు.…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…