Movie News

సుకుమార్ సాధించాడు.. మరి శిష్యుడు?

ఒక దర్శకుడు ఒక కథను ఒక హీరోతో తీద్దామనుకుని ప్రయత్నం చేసి.. ఏవో కారణాలతో అక్కడ దుకాణం సర్దుకుని వేరే హీరో దగ్గరికి వెళ్లిపోవడం.. అదే కథను ఆ హీరోతో తెరకెక్కించడం టాలీవుడ్లో కొత్త కాదు. టాలీవుడ్లో ఇలాంటి సినిమాల లిస్టు తీస్తే చాలా పెద్దదే అవుతుంది. ఈ మధ్య ఇలాంటి చేతులు మారిన సినిమాలు చాలానే కనిపిస్తున్నాయి.

గత కొన్నేళ్లలో జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు అంగీకారం కుదిరాక.. ఏవో కారణాలతో వాటిని పక్కన పెట్టి వేరే హీరోలతో జట్టు కట్టిన దర్శకులు ముగ్గురు ఉండడం విశేషం. తారక్‌తోనే తన డైరెక్టోరియల్ డెబ్యూ చేయడానికి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుని ఆ తర్వాత అతడి కాంపౌండ్ నుంచి బయటికి వచ్చి అదే కథతో అల్లు అర్జున్ హీరోగా ‘నా పేరు సూర్య’ చేశాడు వక్కంతం వంశీ.

కానీ ఆ సినిమా దారుణంగా బోల్తా కొట్టి తారక్ ఈ సినిమా చేయకపోవడం మంచిదే అనుకునేలా చేసింది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్‌తో ఒక సినిమాకు అంగీకారం కుదిరి, కొన్ని నెలలు ట్రావెల్ చేశాక.. త్రివిక్రమ్ దాన్ని క్యాన్సిల్ చేసుకుని మహేష్ బాబుతో ఓ చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నాడు. ఐతే తారక్ కోసం అనుకున్న కథ వేరు. మహేష్‌తో చేయబోయేది వేరని సమాచారం. ఇక తారక్‌‌తో సినిమా క్యాన్సిల్ అయిన మరో దర్శకుడు బుచ్చిబాబు సానా.

అతను తారక్ కోసం సిద్ధం చేసిన కథనే రామ్ చరణ్‌తో తీయబోతున్నాడు. ఇంతకుముందు బుచ్చిబాబు గురువు సుకుమార్.. మహేష్ కోసం అనుకున్న కథనే మార్చి బన్నీతో ‘పుష్ప’ తీశాడు. బన్నీ వచ్చాక కథ, పాత్రల రూపు రేఖలు మారిపోయాయి కానీ.. నేపథ్యం అయితే అదే. ‘పుష్ఫ’ బ్లాక్‌బస్టర్ అయి మహేష్ రిగ్రెట్ కావాల్సిన పరిస్థితి కల్పించింది. ఇప్పుడిక బుచ్చిబాబు వంతొచ్చింది. చరణ్‌తో అతను తీయబోయే సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

మంచి అండర్‌స్టాండింగ్‌తోనే తారక్‌కు బై చెప్పి చరణ్‌తో జట్టు కడుతున్నాడు బుచ్చిబాబు. మరి తన గురువు లాగే అతను కూా పెద్ద హిట్ కొట్టి తారక్ అండ్ ఫ్యాన్స్ ఆ సినిమా చేయనందుకు రిగ్రెట్ అయ్యేలా చేస్తాడేమో చూడాలి.

This post was last modified on November 29, 2022 6:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

భారత్ – పాక్: యుద్ధం జరిగితే ఐరాస ఏం చేస్తుంది?

భారత్, పాకిస్థాన్ మధ్య పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఒకవేళ ఈ పరిస్థితి యుద్ధంగా మారితే, ఐక్యరాజ్య సమితి…

52 minutes ago

తొమ్మిదేళ్లకు దక్కిన ‘మెగా’ అవకాశం

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ ఈ నెల మూడో వారంలో ప్రారంభం కానుంది.…

1 hour ago

శ్రీవిష్ణు ‘సింగిల్’కు డబుల్ ఛాన్స్

ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో హీరో ఇమేజ్, మార్కెట్, క్యాస్టింగ్ పరంగా ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నది సింగిల్ కే.…

2 hours ago

కియారా… బేబీ బంప్‌తో మెగా గ్లామర్

కియారా అద్వానీ.. బాలీవుడ్, తెలుగు సినిమాల్లో ప్రముఖ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న విషయం తెలిసిందే. ఫగ్లీ…

3 hours ago

ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్: టాప్-4లోకి వచ్చేదెవరు?

ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై…

5 hours ago

స్వచ్ఛందంగా వెళ్లిపోతే 1000 డాలర్లు బహుమతి!

డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులను స్వదేశాలకు తిరిగి పంపే ప్రక్రియను వేగవంతం చేయడానికి కొత్త విధానాన్ని…

7 hours ago