Movie News

దిల్ రాజు రెండో పెళ్లి వెనుక..

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నడి వయసులో భార్యను కోల్పోవడం, తర్వాత రెండేళ్లకు రెండో పెళ్లి చేసుకోవడం.. తర్వాత ఓ బిడ్డను కూడా కనడం తెలిసిందే. దిల్ రాజు కూతురే ఆయన్ని రెండో పెళ్లికి ఒప్పించిందని.. దగ్గరుండి పెళ్లి చేయించిందని ఒక ప్రచారం నడిచింది అప్పట్లో. దీనిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ప్రోగ్రాంలో దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. తన రెండో పెళ్లి వెనుక అసలేం జరిగింది అనే విషయాలను ఆయన వివరంగా చెప్పారు. దీనిపై ఆయన ఏమన్నారంటే..

‘‘నా భార్య అనిత చనిపోయే సమయానికి నాకు 47 ఏళ్లు. నేను పక్కా ఫ్యామిలీ మ్యాన్‌ని. ఉన్నట్లుండి భార్యను కోల్పోవడంతో ఎమోషనల్‌గా గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. నేను రోజంతా ఎక్కడ ఉన్నా సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తా. పక్కా ఫ్యామిలీ మ్యాన్ అయిపోతా. అలాంటిది హఠాత్తుగా భార్యను కోల్పోవడంతో ఇంట్లో పరిస్తితి చాలా ఇబ్బందికరంగా మారింది. రెండేళ్ల పాటు ఆ బాధలోనే ఉండిపోయాను. భార్య మరణించాక రెండేళ్లు నా కూతురు, అల్లుడు నా ఇంట్లోనే ఉన్నారు. అయినా సరే లోటు తీరలేదు. అప్పుడు నాకు మళ్లీ పెళ్లి చేయాలని మా అమ్మా నాన్నా ఆలోచించారు. నా కూతురు కూడా అదే అనుకుంది. నా క్లోజ్ ఫ్రెండ్స్ కొందరు కూడా నన్ను ఆ దిశగా పుష్ చేశారు. అప్పుడు ఆప్షన్లు చూశాం. వేరే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను కూడా పరిశీలించాం. వైదా నాకు కరెక్ట్ అనిపించింది. అంతకుముందు తనతో పరిచయం లేదు.

ఐతే నాతో పెళ్లి అంటే ఆమెకు పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి. సెలబ్రెటీ అంటే ప్లస్సులుంటాయి. మైనస్‌లు ఉంటాయి. సినిమాలు, ఫ్యామిలీ.. ఇలా అన్ని విషయాలు తనతో మాట్లాడాక, అంతా ఓక అనుకున్నాక పెళ్లికి రెడీ అయ్యాం. తర్వాత నాకు బిడ్డ పుట్టాడు. నా మొదటి భార్య అనిత, రెండో భార్య వైదా పేర్లు కలిసొచ్చేలా వాడికి ‘అన్వయ్’ అని పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు అంతా హ్యాపీగా ఉంది’’ అని దిల్ రాజు వివరించాడు.

This post was last modified on November 29, 2022 3:02 pm

Share

Recent Posts

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

1 hour ago

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

2 hours ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

2 hours ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

3 hours ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

3 hours ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

4 hours ago