కేవలం నటనకు పరిమితం కాకుండా సినిమాకు స్క్రిప్టు రాయడమే కాక.. మేకింగ్‌లోనూ తమ వంతు పాత్ర పోషించి, అందులోనూ సక్సెస్ అయిన హీరోలు చాలా అరుదుగా ఉంటారు. టాలీవుడ్లో అలాంటి హీరోల్లో ముందు నిలిచేది అడివి శేష్. కర్మ, కిస్ అనే రెండు సినిమాల్ని స్వీయ దర్శకత్వంలో రూపొందించి, నిర్మించి నటించాడు శేష్. కానీ అవి చేదు అనుభవాన్ని మిగిల్చాయి.
కానీ ఆ తర్వాత దర్శకత్వానికి దూరంగా ఉంటూ కథ, స్క్రీన్ ప్లేల్లో అతను కీలకంగా ఉన్న క్షణం, గూఢచారి అద్భుత ఫలితాన్నందుకున్నాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో ఇలాంటి మరో హీరో దొరికాడు. అతనే.. సిద్ధు జొన్నలగడ్డ. ఇటీవలే ‘కృష్ణ అండ్ హిజ్ లీల’తో అతను తన టాలెంట్ అంతా చూపించాడు.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, సంభాషణల్లో సిద్ధు పాత్ర ఉంది. దర్శకుడు రవికాంత్ పేరెపుతో అతను స్క్రిప్టు రాశాడు. సినిమాలో అందుకు క్రెడిట్ కూడా ఇచ్చారు. విశేషం ఏంటంటే.. ఇంతకుముందు తాను నటించిన ‘గుంటూరు టాకీస్’కు కూడా రచనా సహకారం అందించాడు సిద్ధు. ఐతే దానికి అంతగా గుర్తింపు రాలేదు. అందులో అతడి పాత్ర మరీ పెద్దదేమీ కాదు.
ఐతే ‘కృష్ణ అండ్ హిజ్ లీల’తో నటుడిగా, రచయితగా సిద్ధు ప్రతిభ ఏంటో అందరికీ అర్థమైంది. దర్శకుడు రవికాంత్ కూడా సిద్ధు గురించి చాలా బాగా చెబుతున్నాడు. దీంతో అతడిపై ఇండస్ట్రీ జనాలకు గురి కుదిరింది. తాజాగా సిద్ధు ‘నరుడి బ్రతుకు నటన’ పేరుతో ఓ కథ రాశాడు. అది సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్లకు నచ్చింది. ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రానుంది.
This post was last modified on July 15, 2020 11:44 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…