కొన్ని డిజాస్టర్ల గాయాలు అంత త్వరగా మాసిపోవు మర్చిపోనివ్వవు. అందులో ఆచార్య ఒకటి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అత్యంత భారీ ఫ్లాప్ గా నిలిచిన ఈ సినిమా గురించి కనీసం గుర్తు చేసుకునేందుకు కూడా అభిమానులు ఇష్టపడరు. అంత తీవ్రంగా నిరాశపరిచింది. ఆ మధ్య రామ్ చరణ్ ఒక ఈవెంట్ లో ఆర్ఆర్ఆర్ తర్వాత చేసిన మూవీని ఎవరూ పట్టించుకోలేదని అంత వీక్ గా కంటెంట్ ఉందని అర్థమొచ్చేలా చెప్పడం వైరల్ అయ్యింది. ఇప్పటికీ ఏదో ఒక రూపంలో దాని తాలూకు సంగతులు బయటికి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ లిస్టులో మణిశర్మ వచ్చి చేరారు.
ఆచార్యలో కథా కథనాలు ఎంత బాలేనప్పటికీ సంగీతం ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. అసలు మణిశర్మే కంపోజ్ చేశారానే డౌట్ కూడా వచ్చింది. ఈ విషయాన్నే అలీ తన టాక్ షోలో నేరుగా మణిశర్మనే అడిగేశారు. దానికాయన సమాధానం చెబుతూ రెండు పాటలు హిట్ అయిన సంగతి ఎవరూ మాట్లాడరని, అయినా మెగాస్టార్ సినిమాలకు పని చేస్తూ పెరిగిన తాను కావాలని బ్యాడ్ అవుట్ ఫుట్ ఎందుకు ఇస్తానని క్లారిటీ ఇచ్చారు. ముందు ఇచ్చిన బిజిఎం వేరే అయితే దర్శకుడు కొరటాల శివ ఇంకేదైనా కొత్త వెర్షన్ కావాలని కోరడంతో మార్చేశానని అన్నారు.
సో ఇది కూడా కొరటాల పొరపాటేననే స్పష్టత నేరుగా మణిశర్మ నుంచే వచ్చింది. స్వయంగా చెప్పారు కాబట్టి కొట్టిపారేయలేం. నిజానికి తనకు చిరుకు అద్భుతమైన ఆల్బమ్స్ గతంలో ఎన్నో ఉన్నాయి. ఇంద్ర, ఠాగూర్, చూడాలని ఉంది, బావగారు బాగున్నారా ఇప్పటికీ కిక్ ఇచ్చే పాటలు. బాక్సాఫీస్ వద్ద అడ్డంగా బోల్తా కొట్టిన జై చిరంజీవా, మృగరాజు లాంటి వాటికి సైతం సూపర్ ట్యూన్స్ ఇచ్చిన దాఖలాలున్నాయి. ఒక్క ఆచార్యలో మాత్రం ఈ కాంబో లెక్క తప్పింది. మాములుగా ఇలాంటివి బయటికి ఎక్కువగా చెప్పని మణిశర్మ అలీ ముందు ఓపెన్ అవ్వడం గమనార్హం.
This post was last modified on November 29, 2022 10:11 am
భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…
నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…
స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…
కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…