ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడి మాట్లాడి అలసిపోయి ఒక దశ ఆ తర్వాత ఆ టాపిక్ పక్కన పెట్టేశారు అభిమానులు. బాహుబలి అయ్యాక.. సాహో పూర్తి చేశాక.. అంటూ ప్రభాస్ పెళ్లి గురించి అప్పట్లో సంకేతాలు అందాయి. కానీ ప్రభాస్ ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు చేసుకుపోతున్నడు తప్ప పెళ్లి ఊసే ఎత్తట్లేదు.
ప్రభాస్ పెళ్లి చూడాలని ఎంతో ఆశపడ్డ కృష్ణంరాజు ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయారు. మరి పెదనాన్న కోరిక తీర్చడం కోసం ప్రభాస్ ఇప్పుడేమైనా పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడేమో తెలియదు. కానీ ప్రభాస్‌తో ముడిపెట్టి ఒక హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో బాగా నానుతోంది.
ఆ పేరు కృతి సనన్ అని ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. ఆ మధ్య అయోధ్యలో ‘ఆదిపురుష్’ టీజర్ లాంచ్ సందర్భంగా ప్రభాస్‌తో కృతి చాలా సన్నిహితంగా మెలగడం.. అతడికి చెమట పడుతుంటే చున్నీ ఇవ్వజూపడం సోషల్ మీడియా దృష్టిని ఆకర్సించింది.
కానీ ఈ మాత్రానికే ప్రేమ అని ఒక అంచనాకు వచ్చేయలేం. కానీ ఇప్పుడు కృతిని ఉద్దేశించి బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్య మాత్రం అందరిలో ఆలోచన రేకెత్తిస్తోంది. వరుణ్, కృతి కలిసి ‘బేడియా’ (తెలుగులో తోడేలు) అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక టీవీ కార్యక్రమంలో ఈ ఇద్దరూ సందడి చేశారు.అందులో పక్కన కరణ్ జోహార్‌ను పెట్టుకుని ఒక ఆసక్తికర కామెంట్ చేశాడు వరుణ్. కృతి మనసులో ఒక వ్యక్తి ఉన్నాడని.. ఆ వ్యక్తి ఇప్పుడు ముంబయిలో లేడని.. వేరే చోట దీపికా పదుకొనేతో కలిసి షూటింగ్ చేస్తున్నాడని అతను వ్యాఖ్యానించాడు.
ఈ కామెంట్ ప్రభాస్‌ను ఉద్దేశించే అన్నది స్పష్టం. ప్రస్తుతం ప్రభాస్.. ‘ప్రాజెక్ట్-కే’లో భాగంగా దీపికా పదుకొనేతో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. అతను ముంబయిలో ఉండేది తక్కువ. కాబట్టి వరుణ్ అన్నది ప్రభాస్ గురించే అనడంలో సందేహం లేదు. కానీ సినిమా ప్రమోషన్ కోసం తమాషాకు ఈ మాట అన్నాడా.. లేక నిజంగా ప్రభాస్-కృతి మధ్య సీరియస్‌గా వ్యవహారం నడుస్తోందా అన్నది చర్చనీయాంశం అవుతోంది.
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…
ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…