యువ కథానాయకుడు నితిన్ కెరీర్ ఇప్పుడు ప్రమాదంలో ఉంది. కెరీర్లో ఒక దశలో వరుసగా డజనుకు పైగా ఫ్లాపులు ఎదుర్కొన్న నితిన్.. ‘ఇష్క్’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాక కొంచెం జాగ్రత్తగానే సినిమాలు చేస్తూ వచ్చాడు. మధ్య మధ్యలో కొన్ని ఫ్లాపులు వచ్చినా మళ్లీ మంచి హిట్ కొట్టి ట్రాక్‌లో పడుతూ వచ్చాడు.
కానీ ‘భీష్మ’కు ముందు తర్వాత అతడికి చాలానే చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆశలు పెట్టుకున్న ప్రతి సినిమా నిరాశ పరుస్తోంది. గత ఏడాది ‘చెక్’, ‘రంగ్ దె’, ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాలతో అతను హ్యాట్రిక్ ఫ్లాపులు ఎదుర్కొన్నాడు.
అందులోనూ ‘మాచర్ల..’ అయితే నితిన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఇంకో ఫ్లాప్ పడితే తట్టుకునే స్థితిలో లేని నితిన్.. కొంచెం అలెర్ట్ అయినట్లే కనిపిస్తున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయాల్సిన సినిమాకు స్క్రిప్టును ఒక పట్టాన ఓకే చేయకుండా.. అది పర్ఫెక్ట్ అనిపించే వరకు షూటింగ్ మొదలుపెట్టలేదు.
కొన్ని నెలల కసరత్తు తర్వాత స్క్రిప్టును లాక్ చేసి.. ఏ హడావుడి లేకుండా సైలెంటుగా మారేడుమిల్లిలో సూట్ మొదలుపెట్టింది చిత్ర బృందం. ఆదివారమే చిత్రీకరణ ఆరంభమైనట్లు సమాచారం. మారేడుమిల్లి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ‘పుష్ప’ సినిమా.
పేరుకు ఆ సినిమా నడిచేది చిత్తూరు-శేషాచలం అడవుల నేపథ్యంలో కానీ.. నిజానికి చిత్రీకరణ అంతా మారేడుమిల్లిలోనే చేశారు. ఇప్పుడు నితిన్, వక్కంతం కూడా అదే ప్రాంతాన్ని షూటింగ్ కోసం ఎంచుకున్నారు. మరో విషయం ఏంటంటే.. ఇందులో నితిన్ కూడా స్మగ్లర్ పాత్రనే చేస్తున్నాడట.
‘పుష్ప’లో బన్నీ లాగే నితిన్ సైతం జుట్టు గడ్డం బాగా పెంచి డిపరెంట్ లుక్‌లోకి మారిన సంగతి తెలిసిందే. గడ్డం.. స్మగ్లర్.. మారేడుమిల్లి.. ఆ మాటలు వింటే అందరికీ ‘పుష్ప’ను అనుకరిస్తున్నారేమో అన్న సందేహాలు కలగడం ఖాయం. మరి పాత కథలను రీహ్యాష్ చేస్తాడని పేరున్న వక్కంతం.. నితిన్ కోసం ఏం రెడీ చేశాడో చూడాలి.
This post was last modified on November 28, 2022 1:59 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…