Movie News

లవ్ టుడేకి చిక్కొచ్చి పడిందే

ఊహించినట్టే లవ్ టుడే స్లో స్టార్ట్ తో మొదలై ఫుల్ పికప్ అయిపోయింది. ఏబి సెంటర్స్ లో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకంని ఓవర్ టేక్ చేసి పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. ముఖ్యంగా యూత్ ఎగబడుతున్న తీరు భారీ లాభాలకు గ్యారెంటీ ఇస్తోంది. మొదటి రోజే రెండు కోట్లకు పైగా గ్రాస్ రావడం అసలే ఇమేజ్ లేని హీరోకి అరుదుగా జరుగుతుంది. అందులోనూ డబ్బింగ్ మూవీకి ఇలాంటి రెస్పాన్స్ దక్కడం ఈ మధ్య కాలంలో జరగలేదు. నిర్మాత దిల్ రాజు చెప్పినట్టు ఇది సెన్సేషన్ అవ్వడం ఖాయమే. అంతా బాగానే ఉంది కానీ లవ్ టుడేకి కొత్తగా ఓ చిక్కొచ్చి పడింది.

ఒరిజినల్ తమిళ వెర్షన్ వచ్చే వారం డిసెంబర్ 2 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్టు ఓటిటి వర్గాల సమాచారం. ఇది ముందస్తుగా చేసుకున్న ఒప్పందం కావడంతో డేట్ మార్చడానికి లేదు. అయితే తెలుగు ఆడియో ఉండకపోయినా సబ్ టైటిల్స్ తో అర్థం చేసుకునే అవకాశం ఉన్నప్పుడు ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేద్దామనుకునే జనాలు గట్టిగానే ఉంటారు. అధికారిక ప్రకటన ఇవాళో రేపో వచ్చేస్తుంది. ఇక్కడ మంచి రన్ లో ఉన్నప్పుడు ఇలా జరగడం షాకే. నిజానికి లవ్ టుడేకి ముందు అనుకున్న తేదీ నవంబర్ 18. మసూద కోసం మార్చాల్సి రావడం ఇలా ఎఫెక్ట్ ఇచ్చింది

ఏది ఏమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బింగ్ అయినా రీమేక్ అయినా వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చాలా అవసరం. లేదంటే దాని ప్రభావం థియేటర్ కలెక్షన్ల మీద పడుతుంది. లవ్ టుడే రెండో వారంలో ప్రవేశించేనాటికి హిట్ 2 ఒకటే చెప్పుకోదగ్గ రిలీజ్. అది కూడా అన్ని వర్గాలను టార్గెట్ చేసింది కాదు కనక ఆ వీక్ ని కూడా వాడుకునే అవకాశం ఉంది. అప్పుడే కాదు డిసెంబర్ 9 కూడా జనాన్ని ఇట్టే ఆకట్టుకుంటే కంటెంట్ పెద్దగా కనిపించడం లేదు. మొత్తానికి మంచి జోరుమీదున్న లవ్ టుడేకి ఇప్పుడీ పరిణామం ఒకరకంగా స్పీడ్ బ్రేకరే.

This post was last modified on November 28, 2022 8:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

2 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

3 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

4 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

4 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

5 hours ago