కొరటాల రాక కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిటింగ్

Koratala Siva

ప్రస్తుతం సామజిక మాధ్యమాలు సినిమా ప్రమోషన్స్ లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పీ ఆర్ టీంలు ఇచ్చే కంటెంట్ కంటే సోషల్ మీడియాలో సినిమా టీం చెప్పే అప్ డేట్స్ మీదే ఫ్యాన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకులు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. స్టార్ హీరోల సినిమా అంటే ఇక దర్శకులు ఇచ్చే అప్ డేట్స్, లీక్ చేసే వర్కింగ్ స్టిల్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా చూస్తున్నారు. అప్ డేట్స్ కోసం డైరెక్టర్స్ తో సోషల్ మీడియా ద్వారా టచ్ లో వెళ్తున్నారు. వారితో చాటింగ్ చేస్తూ విషయాలు తెలుసుకుంటున్నారు.

అయితే ఎన్టిఆర్ ఫ్యాన్స్ మాత్రం ఆ విషయంలో నిరాశగా ఉన్నారు. దీనికి రీజన్ దర్శకుడు కొరటాల శివకి సోషల్ మీడియాలో ఎకౌంట్స్ లేకపోవడం , ఆయన ఫ్యాన్స్ తో టచ్ లో ఉండకపోవడం. ఆచార్య రిజల్ట్ ముందే పసిగట్టారో ఏమో కానీ సినిమా రిలీజ్ కంటే ముందే కొరటాల శివ సోషల్ మీడియాకి గుడ్ బై చెప్పేసి వీడియో పెట్టారు. అప్పటి నుండి కొరటాల సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నారు.

ఇప్పుడు ఎన్టీఆర్ తో కొరటాల చేస్తున్న సినిమా కోసం అయినా ఈ స్టార్ డైరెక్టర్ సోషల్ మీడియాలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి సంబంధించి కొరటాల కి ఏదైనా చెప్పాలన్నా మెచ్చుకోవలన్నా వారికి చాన్స్ లేకుండా పోయింది. మరి #NTR30 కోసం అయినా కొరటాల మళ్ళీ సోషల్ మీడియాలోకి రీ ఎంట్రీ ఇచ్చి అప్ డేట్స్ పెడుతూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటే బాగుండని కొందరు ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.