ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ వచ్చాక థియేటర్ల దగ్గర క్యూల్లో నలిగిపోతూ, లాఠీ దెబ్బలు తింటూ నానా అవస్థలు పడి టికెట్లు సంపాదించాల్సిన అవసరం లేకపోయింది. బుక్ మై షో తెరిచి పెట్టుకుని మొబైల్లో సింపుల్‌గా టికెట్లు బుక్ చేసుకునే సౌలభ్యం లభించింది. ఐతే మంచి క్రేజ్ ఉన్న సూపర్ స్టార్ల సినిమాలు రిలీజైతే ఎంత చురుగ్గా స్పందించినా టికెట్లు బుక్ చేయడం కష్టమే. ఇలా టికెట్లు పెట్టడం.. నిమిషాల్లో టికెట్లన్నీ ఖాళీ అయిపోవడం జరుగుతుంటుంది. ఐతే అలాంటి సినిమాలు వేళ్ల మీద లెక్కబెట్టేలా ఉంటాయి.
ఈ ఏడాది వేసవిలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చిత్రాల తర్వాత అంత డిమాండ్ ఏ సినిమాకూ కనిపించలేదు. కానీ ఇప్పుడు ఒక పర భాషా చిత్రం టికెట్లు సంపాదించడం శక్తికి మించిన పని అయ్యేలా కనిపిస్తోంది. ఆ సినిమానే.. అవతార్-2. 13 ఏళ్ల కిందట ప్రపంచవ్యాప్తంగా సంచలన వసూళ్లు సాధించిన ‘అవతార్’కు ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే.
మన సూపర్ స్టార్ల సినిమాలకు దీటుగా, ఇంకా చెప్పాలంటే అంతకుమించిన క్రేజ్ కనిపిస్తోంది ‘అవతార్’ విషయంలో. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్లు ఒకదాన్ని మించి ఒకటి అన్నట్లుగా ఉండడం.. జేమ్స్ కామెరూన్ మరోసారి ప్రేక్షకులను ఒక అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్లేలా కనిపిస్తుండడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని తహతహలాడిపోతున్నారు ప్రేక్షకులు. ‘అవతార్’ సినిమా చూసిన అనుభూతే అద్భుతం అంటే.. అప్పటితో పోలిస్తే ఇప్పుడు మరింత పెరిగిన టెక్నాలజీతో వేరే లేవెల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు కామెరూన్. దీంతో ‘అవతార్-2’కు హైప్ మరింత పెరిగిపోతోంది. మామూలుగా ఎంత పెద్ద హీరోల సినిమాలైనా వారం పది రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ అవుతుంటాయి. కానీ ‘అవతార్-2’కు మాత్రం మూడు వారాల ముందే బుకింగ్స్ మొదలైపోయాయి.
దేశవ్యాప్తంగా పలు మల్టీప్లెక్సులు బుకింగ్స్ ఓపెన్ చేయగా.. అందుబాటులో ఉంచిన షోలకు నిమిషాల్లో టికెట్లు అమ్ముడైపోయాయి. హైదరాబాద్‌లో రెండు మల్టీప్లెక్సుల్లో వీకెండ్ మొత్తానికి టికెట్లు సోల్డ్ ఔట్ అయిపోవడం విశేషం. ఈ దూకుడు చూస్తుంటే ఇండియన్ బాక్సాఫీస్‌ను ‘అవతార్-2’ షేక్ చేయడం, వసూళ్లలో సరికొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on November 26, 2022 3:27 pm
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…
ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…
షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…