అదేంటో ప్రభాస్ సినిమా ఏదైనా సరే కనీసం నాలుగైదు వాయిదాలు లేనిదే విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అది గ్రహాల ప్రభావమో లేక నిర్మాత ప్లానింగ్ లోపమో ఏదైతేనేం ఫ్యాన్స్ మాత్రం ఎదురు చూపులతో అగ్నిపరీక్షనే ఎదురుకుంటున్నారు.
ఆదిపురుష్ ని 2023 సంక్రాంతి బరి నుంచి తప్పించి జూన్ 16కి అధికారికంగా పోస్ట్ పోన్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తేదీ పట్ల ఫ్యాన్స్ సంతృప్తి లేకపోయినప్పటికీ కంటెంట్ ఉన్నప్పుడు ఎప్పుడైతేలెమ్మని సర్దుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడా టార్గెట్ ని చేరుకోవడం కూడా కష్టంగా భావించి తమ నిర్ణయాన్ని మరోసారి పునఃసమీక్షించుకునే పనిలో పడ్డారట.
ఒకవేళ ఇదే నిజమైతే ఆదిపురుష్ 2024 సంక్రాంతికి వెళ్ళిపోతుంది. అంటే ఇంకో ఏడాది పైగానే వెయిట్ చేయాల్సి ఉంటుంది. నిర్మాణ సంస్థ టి సిరీస్ ఇంకా అఫీషియల్ గా చెప్పకపోయినా ముంబై ఫిలింనగర్ వర్గాల్లో దీని గురించి పెద్ద చర్చే జరుగుతోంది. ముందు విజువల్ ఎఫెక్ట్స్ రిపేర్ల కోసం వంద కోట్లు అదనంగా ఖర్చు పెడదాం అనే స్టేజి నుంచి ఇప్పుడు ఫైనల్ ఫిగర్ ని ఏడు వందల కోట్లయినా పర్లేదు రాజీ పడకూడదని డిసైడ్ అయ్యారట టీజర్ వచ్చినప్పటి నుంచి నెగటివ్ ట్రోలింగ్ తో ఉక్కిరిబిక్కిరైన దర్శకుడు ఓం రౌత్ బృందానికి ఒత్తిడి పెరిగిన అంచనాలను అందుకోవడం పెద్ద సవాల్ గా మారింది.
ఈ లెక్కన అభిమానులు కోరుకున్నట్టు సలార్ నే ముందు చూడచ్చు. సెప్టెంబర్ 23న ఇది థియేటర్లలో అడుగు పెట్టేస్తుంది. చేయాల్సిన షూటింగ్ ఇంకా బాలన్స్ ఉన్నప్పటికీ వచ్చే ఏడాది వేసవిలోపే మొత్తం పూర్తి చేసేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు. కెజిఎఫ్ ని మించి వయొలెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ప్రభాస్ ని ఎప్పుడెప్పుడు చూద్దామనే ఉత్సుకత మూవీ లవర్స్ లో ఎక్కువగా ఉంది. అది పురుష్ కనక 2023 నుంచి తప్పుకుంటే ఇంకో రెండు నెలల్లో సలార్ ప్రమోషన్లు స్టార్ట్ చేస్తారు. ఎలా చూసుకున్నా వచ్చే సంవత్సరం డార్లింగ్ మూవీ ఒకటే వచ్చేలా ఉంది
This post was last modified on November 26, 2022 11:41 am
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…