మన దగ్గర ఒక సినిమా కొన్ని వందల కోట్ల కలెక్షన్లు రాబడితేనే చాలా గొప్పగా చెప్పుకుంటుంటాం. వెయ్యి కోట్లకు అంతకుమించి వసూళ్లు రాబట్టిన ఇండియన్ సినిమాలను వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. ఈ స్థాయిని హాలీవుడ్ సినిమాలు దశాబ్దాల కిందటే అందుకున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్‌తో ముడిపడ్డ భారీ హాలీవుడ్ చిత్రాలు రిలీజైతే ఇప్పుడు బిలియన్ డాలర్లు (దాదాపు 8 వేల కోట్లు) వసూలు చేయడం లాంఛనమే అన్నట్లుంది పరిస్థితి.
మిగతా సినిమాలకే అలా ఉంటే ఇక అవతార్ సిరీస్‌లో రాబోతున్న కొత్త చిత్రం పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. దీనికి జరుగుతున్న బిజినెస్ గురించి ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చే నడుస్తోంది. అవతార్ ఫస్ట్ పార్ట్ 2 బిలియన్ డాలర్లకు పైగానే వసూళ్లు రాబట్టడంతో ఆమేరకు ఆల్రెడీ బిజినెస్ పూర్తయినట్లు సమాచారం.
వరల్డ్ వైడ్ అవతార్-2 2 బిలియన్ డాలర్లు అంటే మన రూపాయల్లో దాదాపు 16 వేల కోట్లు రాబడితే తప్ప బ్రేక్ ఈవెన్ అవ్వదు. అంతకుమించి వచ్చేదే లాభం అన్నమాట. ఐతే ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలు, దీనికి దక్కిన భారీ రిలీజ్‌ను బట్టి చూస్తే తొలి వారంలోనే బిలియన్ డాలర్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మూడు వారాల్లో 2 బిలియన్ మార్కును అందుకోవడం కూడా పక్కా అనే ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు.
ఇండియా వరకే అవతార్-2 మినిమం 500 కోట్లు వసూలు చేస్తుందన్నది అంచనా. తెలుగులో కూడా వంద కోట్ల వసూళ్లు కేక్ వాక్ అని భావిస్తున్నారు. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాక పెట్టిన టికెట్లు పెట్టినట్లే అయిపోతున్నాయి. డిసెంబరు 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 26, 2022 3:16 pm
మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ రానే వచ్చింది. నిన్న సాయంత్రమే ‘పుష్ప: ది రూల్’ ట్రైలర్ను వివిధ భాషల్లో లాంచ్ చేశారు.…
రానాను చిరంజీవి కొట్టడం ఏంటి.. అంత తప్పు ఏం చేశాడు.. రానాను కొట్టేంత చనువు చిరుకు ఉందా అని ఆశ్చర్యపోతున్నారా?…
‘పుష్ప: ది రైజ్’ సినిమాలో మిగతా హైలైట్లన్నీ ఒకెత్తయితే.. సమంత చేసిన ఐటెం సాంగ్ మరో ఎత్తు. అప్పటిదాకా సమంతను…
కోలీవుడ్లో పిన్న వయసులోనే మంచి పేరు సంపాయించుకున్నయువ హీరో దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా..…
జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్…