న్యాచురల్ స్టార్ నాని సోదరి దీప్తి ఘంటా దర్శకురాలిగా డెబ్యూ చేసిన వెబ్ సిరీస్ మీట్ క్యూట్. టాలీవుడ్ లో లేడీ డైరెక్టర్స్ అరుదైపోతూ వాళ్ళ నుంచి ఏడాదికి ఒకటో రెండో సినిమాలు వస్తున్న టైంలో నాని తన సిస్టర్ ని ఈ రకంగా ప్రోత్సహించడం మంచి పరిణామం. స్వయానా నిర్మాణ బాధ్యతలు తీసుకుని ప్రమోషన్లు గట్రా తనే దగ్గరుండి చేయించాడు. సత్యరాజ్, రోహిణి లాంటి సీనియర్ క్యాస్టింగ్ తో పాటు, రుహానీ శర్మ, అదా శర్మ, వర్ష బొల్లమ ;తదితరుల యంగ్ జెనరేషన్ ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయిదు కథలను తీసుకుని అరగంటకు అటుఇటుగా హ్యూమన్ ఎమోషన్స్ గురించి చెప్పే ప్రయత్నం చేశారు.
ఇక సిరీస్ లో చూస్తే మొదటిది మీట్ ది బాయ్. పెళ్లి చూపుల కోసం బయట కలుసుకున్న ఓ అమ్మాయి అబ్బాయి మధ్య సంభాషణగా సాగుతుంది. ఇందులో చిన్న సర్ప్రైజ్ పెట్టారు. రెండోది ఓల్డ్ ఈజ్ గోల్డ్. విదేశీ ట్రిప్ కు వెళ్లాలనుకున్న భార్యను వద్దని చెప్పలేని భర్త సంఘర్షణకు పరిష్కారం ఒక వృద్ధుడి ద్వారా చెప్పించడం. మూడోది ఇన్ లా. కొడుకు ప్రేమించిన యువతి గురించి ఆరా తీయడానికి అతని తల్లే రంగంలో దిగి ఆశ్చర్యపోయే విషయాలు తెలుసుకోవడం. నాలుగోది స్టార్స్ టాక్. రాత్రిపూట కారు చెడిపోయిన ఓ హీరోయిన్ కు ఆమె ఎవరో తెలియని డాక్టర్ లిఫ్ట్ ఇచ్చాక జరిగే సంఘటన.
అయిదోది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. పెళ్లయ్యాక మొగుడంటే ఇష్టం కలగని ఓ భార్యకు బయటి నుంచి వచ్చిన అమ్మాయి కనువిప్పు కలిగించడం. మానవ సంబంధాలను నేపథ్యంగా తీసుకున్న దీప్తి ఈ మీట్ క్యూట్ ని పూర్తిగా అర్బన్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తీశారు. అయితే టేకింగ్ నెమ్మదిగా సాగడం, సుదీర్ఘమైన సంభాషణలు ఉండటం తక్కువ నిడివి ఉన్న కొన్ని ఎపిసోడ్స్ ని ల్యాగ్ ఫీలింగ్ వచ్చేలా చేశాయి. టెక్నికల్ టీమ్ పనితనం బాగుంది. ఎంత ఓటిటి కోసమైనా సరే మెసేజ్ పేరుతోనో భావోద్వేగాల పేరుతోనో సాగదీయాల్సిన అవసరం లేదు. కాస్త గట్టి ఓపిక చేసుకుంటేనే ఈ మీట్ క్యూట్ కి కనెక్ట్ అవ్వొచ్చు.
This post was last modified on November 25, 2022 10:12 pm
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…
సంక్రాంతి పండక్కు తెలుగు రాష్ట్రాల థియేటర్లకు ఊహించిన సమస్యే తలెత్తింది. షోలు చాలక ప్రేక్షకుల డిమాండ్ అధికం కాగా దానికి…
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి…