సినిమా రిలీజయ్యే వరకే ప్రమోషన్లు చేయడం గొప్పనుకుంటున్న టైంలో విడుదలైన ఆరు నెలల తర్వాత కూడా ఎక్కడో జపాన్ దేశానికి వెళ్లి ప్రచారంలో పాల్గొన్న రాజమౌళి టీమ్ దానికి తగ్గ ఫలితాన్నే అందుకుంటోంది. ముఖ్యంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అక్కడ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం ఎంత ప్లస్ అయ్యిందో కలెక్షన్ల రూపంలో కనిపిస్తోంది. హై ఎమోషనల్ అండ్ యాక్షన్ కంటెంట్ ఉన్నవాటిని మాత్రమే ఎక్కువగా ఆదరించే జపాన్ లో రామరాజు భీంల కథ ఏ మేరకు కనెక్ట్ అవుతుందోననే అనుమానాలు బద్దలు కొడుతూ ఎట్టకేలకు ఆ దిశగా పరుగులు పెడుతోంది
ఇప్పటిదాకా ఆ దేశంలో విడుదలైన ఇండియన్ సినిమాల్లో అత్యంత వేగంగా 300 మిలియన్ యెన్లను దాటేసిన చిత్రంగా ఆర్ఆర్ఆర్ కొత్త రికార్డు సృష్టించింది. అది కూడా కేవలం ముప్పై అయిదు రోజుల లోపే. థియేటర్లో నమోదు చేసుకున్న ఫుట్ ఫాల్స్ అక్షరాలా 2 లక్షల 3 వేల 867. అంటే ఇంత మంది జక్కన్న మాయాజాలాన్ని చూసేందుకు టికెట్లు కొన్నారు. ఇదింకా కొనసాగుతోంది. పైరసీ జాడే ఉండని జపాన్ లో పాజిటివ్ టాక్ వచ్చిన మూవీస్ కి చాలా లాంగ్ రన్ ఉంటుంది. బాహుబలి 2 సుదీర్ఘ కాలం ఆడింది. ఇప్పుడు ఎంత లేదన్నా ఆర్ఆర్ఆర్ ఇంకో నెల రోజులు కొనసాగడం ఖాయం.
టాప్ వన్ పొజిషన్ లో ఉన్న రజినీకాంత్ ముత్తుని దాటేందుకు ఆర్ఆర్ఆర్ కావాల్సింది కేవలం 100 మిలియన్ యెన్లు. ఆల్రెడీ ముప్పాతిక టార్గెట్ పూర్తయ్యింది కానీ ఇదేమంత కష్టం కాదు. అసలే ఆస్కార్ కోసం దేశ విదేశాలు తిరుగుతున్న రాజమౌళి కేవలం ఆ క్యాంపైన్ కోసమే యాభై కోట్లు ఖర్చు చేశారన్న టాక్ బలంగా ఉంది. అది నిజమో కాదో ఆయన చెప్పరు కానీ బాగా కష్టపడుతున్న మాట వాస్తవం. గత కొన్నేళ్లలో ఒక బ్లాక్ బస్టర్ గురించి ఎనిమిది నెలల తర్వాత కూడా డిస్కషన్ జరుగుతోందంటే చిన్న విషయం కాదు. నిజంగా ఆస్కార్ కల వేరవేరితే ఆ సంబరాలకు ఆకాశమే హద్దు.
This post was last modified on November 25, 2022 4:54 pm
ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…
ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…
దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…