సీతారామమ్ సినిమాతో తెలుగులో పాపులర్ అయిపోయింది బాలీవుడ్ టివి సీరియల్స్ భామ మృణాల్ థాకూర్. అప్పటికే హిందీలో చాలా సినిమాల్లో సైడ్ క్యారక్టర్స్ అలాగే మెయిన్ లీడ్స్‌లో చేసింది కాని, అమ్మడికి ఎందుకో బ్రేక్ రాలేదు. కాని సీతారామమ్ సినిమాతో తెలుగులో ఒక్కసారిగా బాగా పేరొచ్చింది. అయితే ఇప్పటివరకు ఇక్కడ మరో సినిమానే సైన్ చేయలేదు. దానికి కారణం ఆమె కోటి రూపాయలు డిమాండ్ చేస్తోందని టాక్ వినిపిస్తుంటే.. అసలు మరో రీజన్ ఉందని ఫీలైందట ఈ మహారాష్ట్ర బ్యూటి.
హను రాఘవపూడి రూపొందించిన సినిమాలో ప్రిన్సెస్ నూర్‌జహాన్ పాత్రలో చాలా హుందాగా కనిపించింది మృణాల్. ఎక్కువగా చీరల్లో దర్శనమిచ్చి.. ఒక సొగసైన లేడీగా అలరించింది. కాని ఆమె బాలీవుడ్‌లో ఆరబోసినట్లు అందాల ఆరబోతకు ఛాన్సు దొరకలేదు. అయితే మృణాల్ కూడా.. తెలుగులో ఇలాంటి హుందాగా ఉండే రోల్స్ చేస్తాను కాని, గ్లామరస్ రోల్స్ చేయనంటూ ఎక్కడో చిన్న కామెంట్ చేయడంతో.. తెలుగు నుండి ఆఫర్లు రావట్లేదని అనిపించిందట. ఈ మధ్యన బాలీవుడ్‌లో కూడా నాన్-గ్లామర్ లుక్‌లోనే ఎక్కువగా దర్శనమిస్తున్న మృణాల్.. ఇప్పుడు టోటల్‌గా పందా మార్చాలని డిసైడైయ్యి.. ఒక ఫ్యాషన్ షోలో.. ఈజిప్షియన్ ప్రిన్సెస్ తరహాలో సందడి చేసింది.
మొన్నటివరకు కేవలం డీప్ నెక్ దస్తుల్లో సందడి చేసిన మృణాల్.. సడన్‌గా ఇలా పొట్టి దుస్తుల్లో అందాలన ఆరబోయడంతో చూపరులు కూడా ఆశర్చర్యపోయారు. ఇక మీదట కొన్ని రోజులు ఇదే తరహాలో హాట్ లుక్స్‌లో సందడి చేస్తూ.. టాలీవుడ్‌కు ఒక పెద్ద మెసేజ్ ఇస్తుందట. ఆ విధంగానైనా పెద్ద సినిమాల ఆఫర్లు తనకు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరి గేర్ మార్చిన ప్రిన్సెస్‌కు తెలుగు ఇండస్ట్రీ ఎలాంటి ఛాన్సులిస్తుందో చూద్దాం.
This post was last modified on November 25, 2022 10:17 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…