Movie News

థియేటర్ల గొడవపై ప్రెస్ మీట్ పెడతా – దిల్ రాజు

దిల్ రాజు ఈ మధ్య వరుసగా నెగెటివ్ వార్తలతోనే మీడియాకు ఎక్కుతున్నాడు. జులైలో తన ప్రొడక్షన్ నుంచి వచ్చిన ‘థాంక్యూ’ సినిమా కోసం ‘కార్తికేయ-2’ చిత్రాన్ని వాయిదా వేయించాడంటూ ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. ఈ ఇష్యూలో ఆయన ఇమేజ్ బాగానే డ్యామేజ్ అయింది.

ఇందులో తన తప్పేమీ లేదని చెప్పుకోవడానికి రాజు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘వారిసు’ తెలుగు అనువాదానికి ఎక్కువ థియేటర్లు అట్టి పెడుతున్న విషయంలో రాజు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పండుగలప్పుడు తెలుగు సినిమాలకే ప్రాధాన్యం ఉండాలని, డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు కష్టమని గతంలో వ్యాఖ్యానించి ఇప్పుడు అందుకు భిన్నంగా రాజు వ్యవహరిస్తున్నాడంటూ ఆయన మీద ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. దీనిపై కొన్ని రోజులుగా పెద్ద చర్చే నడుస్తోంది.

ఐతే ఇన్ని రోజులు ఈ విషయమై మౌనం వహించిన రాజు.. తాజాగా ‘మసూద’ అనే చిన్న సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడుతూ స్పందించాడు. త్వరలోనే ‘వారసుడు’ థియేటర్ల ఇష్యూ మీద ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు రాజు వెల్లడించాడు. ప్రతి విషయంలోనూ తనను అందరూ తప్పుగాఅర్థం చేసుకుంటున్నారని, తనలో రెండో కోణం ఎవరికీ తెలియదని రాజు అన్నాడు. “దిల్ రాజు సినిమాలను తొక్కేస్తాడు అని నా మీద చాలామంది రకరకాలుగా మాట్లాడుతుంటారు. కానీ నాలో ఇంకో సైడ్ కూడా ఉంది అని ఎవరికీ తెలియదు. సినిమాను ప్రేమించి మంచి కంటెంట్‌తో సినిమాలు తీసే వాళ్ల కోసం నేను ఏం చేయడానికైనా రెడీ. ఒక అద్భుతమైన సినిమాను మన వాళ్లకు చూపిద్దామని తమిళ చిత్రం ‘లవ్ టుడే’ను తెలుగులో రిలీజ్ చేస్తున్నా. ఇందులో నాకు రూపాయి కూడా మిగలదు. కానీ సినిమా మీద ప్యాషన్‌తో రిలీజ్ చేస్తున్నా. డబ్బులు వద్దు నాకు. ఏం చేసుకుంటాం డబ్బులతో? ఇక వారిసు సినిమా విషయానికి వస్తే థియేటర్ల ఇష్యూ గురించి త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి అసలేం జరుగుతోందో వివరిస్తా” అని రాజు తెలిపాడు.

This post was last modified on November 24, 2022 1:58 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

3 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

4 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

4 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

4 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

5 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

6 hours ago