బాహుబలి ఫ్రాంచైజ్ తో టాలీవుడ్ ను ఇండియన్ సినిమా స్థాయికి చేర్చి ఇండియన్ సినిమాకే టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు రాజమౌళి. తాజాగా వచ్చిన RRR రాజమౌళి స్థాయిని మరింత ఉన్నత స్థాయికి చేర్చింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న జక్కన్న హాలీవుడ్ ఇండస్ట్రీ చేత దర్శకుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం రాజమౌళి తో ఏ దర్శకుడిని పోల్చలేం. ఇది తెలుగు టాప్ డైరెక్టర్స్ అందరూ ఒప్పుకుంటారు. తాజాగా రాజమౌళి తో ఒక కుర్ర దర్శకుడిని పోలుస్తూ జబర్దస్త్ కమెడియన్ ఓ స్టేట్ మెంట్ పాస్ చేశాడు.
తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘హనుమాన్’ టీజర్ తాజాగా రిలీజయింది. హైదరాబాద్ లో ఓ ఈవెంట్ ఏర్పాటు చేసి టీజర్ లాంచ్ చేశారు. అందరూ మాట్లాడిన తర్వాత జబర్దస్త్ ఆర్టిస్ట్ గెటప్ శ్రీను మైక్ పట్టుకున్నాడు. ఎత్తుకోవడమే ఇండస్ట్రీకి ఇద్దరు రాజమౌళిలున్నారు అంటూ ప్రశాంత్ వర్మ ను జక్కన్నతో పోల్చేశాడు. రాజమౌళి ని చూసి ఇన్స్పైర్ అవుతున్నట్టే ప్రశాంత్ వర్మ ను కూడా చూసి అలాగే ఇన్స్పైర్ అవుతాడని ఏదో చెప్పుకొచ్చాడు.
ప్రశాంత్ వర్మ ఫిలిం మేకింగ్ అంటే చాలా మంది ప్రేక్షకులను ఇష్టం. అతని ఐదియాలజీ, ఫిలిం మేకింగ్ కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తాయి. ఇప్పటి వరకు సాలిడ్ హిట్ లేకపోయినా టాలెంటెడ్ డైరెక్టర్ అనే ట్యాగ్ తో షోల ప్రోమోలు , సినిమాలతో ముందుకు సాగుతున్నాడు. హనుమాన్ టీజర్ కూడా ఆడియన్స్ ను ఆకట్టుకుంది. టీజర్ చూసి ప్రశాంత్ వర్మ ని మెచ్చుకోకుండా ఉండలేం. కానీ మరీ ఓవర్ గా గెటప్ శ్రీను ప్రశాంత్ ని రాజమౌళి తో పోల్చడమే ఎవ్వరికీ మింగుడు పడటం లేదు.
ఇక శ్రీను అలా అన్నప్పుడు కనీశం ప్రశాంత్ వర్మ అయినా మైక్ తీసుకొని రాజమౌళి స్థాయి తనకి లేదని ఇంకా ఎదగాలని చెప్పుకుంటే బాగుండేది. కానీ శ్రీను చేసే భజన వింటూ చూస్తూ తను కూడా ఎంజాయ్ చేయడమే కొందరు రాజమౌళి ఫ్యాన్స్ కి నచ్చలేదు. ఏదేమైనా అవకాశాల కోసం కొందరు నటులు ఏదైనా అనేస్తారు ఎన్నైనా చెప్పేస్తారు. కానీ రియాలిటీ చూసుకొని మాట్లాడితే వారికి మర్యాద దక్కుతుంది లేదంటే భజన బ్యాచ్ లో స్థానం పొందుతారు.
This post was last modified on November 22, 2022 10:35 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…