సాధారణంగా స్టార్ హీరోలు థియేటర్స్ , కలెక్షన్స్ గురించి ఎక్కువగా పట్టించుకోరు. ఆ భాద్యతంతా నిర్మాత మీదే పెట్టేస్తుంటారు. అందులోకి సీనియర్ హీరోలయితే పొరపాటున కూడా నిర్మాత కి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోరు. దీనికి చాలా లెక్కలుంటాయి. ఏదో ఒక ఏరియా మేరకు తీసుకోవడం వరకే ఇన్వాల్వ్ అవుతారు తప్ప అన్నింటిలో తలదూర్చరు.
ప్రస్తుతం చిరు , బాలయ్య కూడా అదే చేస్తున్నారు. వచ్చే సంక్రాంతి కి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్నాయి. వీటితో పాటే అజిత్ సినిమా అలాగే విజయ్ సినిమా కూడా రిలీజ్ అవ్వబోతున్నాయి. ముఖ్యంగా విజయ్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ‘వారసుడు’ సినిమాకి తెలుగులో ఎక్కువ థియేటర్స్ కేటాయిస్తున్నారని, మంచి థియేటర్స్ ఈ డబ్బింగ్ సినిమా కోసం ముందే బుక్ చేసేశారని ఫ్యాన్స్ నుండి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో దిల్ రాజు ని ఇరు వర్గాల అభిమానులు తప్పుబడుతున్నారు.
అయితే ఇంత జరుగుతున్నా విషయం చిరు , బాలయ్య వరకూ వెళ్ళడం లేదా ? అనే ప్రశ్న ఫ్యాన్స్ మనసులో మెదులుతుంది. సంక్రాంతి పోటీ లో నిలవడమే కాదు సినిమా రిలీజ్ లు , థియేటర్స్ విషయాలు కూడా చూసుకోవాలని వారు భావిస్తున్నారు. కానీ వీటికి చిరు -బాలయ్య ఇద్దరూ వ్యతిరేకమే. అవును ఇద్దరూ తమ సినిమాల రిలీజ్ విషయాన్ని పూర్తిగా మైత్రి నిర్మాతలకే అప్పగించారు. థియేటర్స్ విషయంలో కానీ డబ్బింగ్ గొడవల్లో కానీ చిరు- బాలయ్య లు ఇన్వాల్వ్ అయ్యే సమస్యే లేదనిపిస్తుంది. ఫైనల్ గా చిన్నా చితక నిర్మాతలు ఏమైనా పబ్లిసిటీ కోసం రాద్దాంతం చేసి మీడియాకి ఎక్కాలే కానీ ఇండస్ట్రీలో కూడా డబ్బింగ్ లొల్లి ని ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితిలో లేరు.
This post was last modified on November 22, 2022 10:17 pm
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…
ముందో విడుదల తేదీ అనుకుని పోటీ వల్ల వెనుకడుగు వేసి ఇప్పుడు కొత్త డేట్ పట్టుకునేందుకు కిందా మీద పడుతున్న…
https://youtu.be/zHiKFSBO_JE?si=HDSpx4GNEhcOje0y కొత్త సంవత్సరం తొలి ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ జనవరి 10 విడుదల కాబోతున్న నేపథ్యంలో అందరి…
టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్మన్ గిల్తో పాటు యువ క్రికెటర్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మలు ఓ…
తండేల్ విడుదలకు ఇంకో 35 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటిదాకా ప్రమోషన్లు ఊపందుకోలేదు. సంధ్య థియేటర్ దుర్ఘటనలో అల్లు అర్జున్…