ఇప్పటిదాకా హాలీవుడ్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్‌లో మంచి వసూళ్లు సాధించడం, మన సినిమాలకు పోటీ ఇవ్వడమే చూశాం. కానీ త్వరలో ఓ హాలీవుడ్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను సునామీలా ముంచెత్తడం.. వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు నెలకొల్పడం.. ఆ సినిమా చూడడం కోసం మన ప్రేక్షకులు తహతహలాడిపోవడం.. టికెట్లు దొరక్క అల్లాడిపోవడం చూడబోతున్నాం. ఈ ఉపోద్ఘాతం ‘అవతార్-2’ గురించే అని ఈపాటికే అర్థమై ఉంటుంది.
ఇప్పటిదాకా ఇండియాలో హాలీవుడ్ సినిమాల హవా అనగానే అందరికీ ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’యే గుర్తుకు వస్తుంది. ఆ సినిమా ఇక్కడి సూపర్ స్టార్ల సినిమాల స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర ఆధిపత్యం చలాయించింది. డిసెంబరు 16న రాబోతున్న ‘అవతార్-2’కు సంబంధించి హంగామా ఇంకో లెవెల్లో ఉండబోతోందన్నది స్పష్టం. 2009లో ‘అవతార్’ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే.
అలాంటి సినిమాకు సీక్వెల్ కావడం, దీని ట్రైలర్లు ఒక రేంజిలో ఉండడంతో ‘అవతార్-2’కు హైప్ మామూలుగా లేదు. దీనికి పోటీగా ఏ భాషలోనూ చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ చేసే సాహసం చేయడం లేదు. డిసెంబరు 16 నుంచి వారం రోజుల పాటు ఇండియన్ బాక్సాఫీస్‌ను ‘అవతార్-2’కే రాసిచ్చేయబోతున్నారు.
మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లు అని తేడా లేకుండా మెజారిటీ థియేటర్లలో ఈ సినిమానే ఆడబోతోంది. ఈ సినిమాకు నెలకొనబోయే డిమాండ్ ఎలా ఉంటుందో అంచనా వేసి ఇండియాలో పలు సిటీల్లో ముందు రోజు అర్ధరాత్రి నుంచే ‘అవతార్-2’ స్పెషల్ షోలను ప్రదర్శించబోతున్నారట. కొన్ని నగరాల్లో 24 గంటల పాటు సినిమా ప్రదర్శనకు అనుమతులు తీసుకుంటున్నారట. తొలి వీకెండ్లో విరామం లేకుండా షోలు ప్రదర్శించబోతున్నట్లు సమాచారం. ఇలా ఓ హాలీవుడ్ సినిమాలకు మిడ్ నైట్, తెల్లవారుజామున షోలు పడడం ఇండియాలో ఇప్పటిదాకా జరగలేదు. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండాలే కానీ.. ‘అవతార్-2’ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on November 22, 2022 10:06 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…