కొన్నేళ్ల నుంచి బాలీవుడ్ చాలా వరకు రీమేక్ సినిమాలతోనే సాగిపోతోంది. సొంత కథలు కరువైపోయి.. దక్షిణాది నుంచి హిట్టయిన సినిమాలను తీసుకుని కొంచెం మార్చి తమ ప్రేక్షకులకు అందిస్తోంది. ఐతే ఓటీటీల పుణ్యమా అని అన్ని భాషల చిత్రాలూ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమ్ అవుతుండడం.. కొన్ని చిత్రాలకు హిందీ ఆడియోలు కూడా అందుబాటులో ఉండడంతో.. మంచి టాక్ తెచ్చుకున్న ప్రతి సినిమానూ చూసేస్తున్నారు అక్కడి జనాలు. అవి చాలవన్నట్లు సౌత్ హిట్ సినిమాలను హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో పెట్టేస్తున్నారు.
దీంతో రీమేక్‌ల పట్ల ఆసక్తి అంతకంతకూ తగ్గిపోతోంది. ఉన్నదున్నట్లుగా తీసినా, మార్పులు చేర్పులు చేసినా ఫలితం లేకుండా పోతోంది. ఈ ఏడాది బచ్చన్ పాండే, జెర్సీ, హిట్, విక్రమ్ వేద లాంటి రీమేక్ సినిమాలు హిందీలో రిలీజయ్యాయి. అవన్నీ కూడా దారుణమైన ఫలితాలను అందుకున్నాయి. మంచి టాక్ తెచ్చుకుని కూడా ఈ సినిమాలేవీ నిలవకపోవడంతో బాలీవుడ్ జనాలకు కంగారు మొదలైంది.
ఇక రీమేక్ సినిమాలు కట్టి పెడితే తప్ప ఇండస్ట్రీ బాగుపడదనే అభిప్రాయాలు బాలీవుడ్ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. ఇదే అభిప్రాయం బలపడుతున్న సమయంలో ఇప్పుడు ‘దృశ్యం-2’ వచ్చింది. ఇది మలయాళంలో అదే పేరుతో తెరకెక్కిన సీక్వెల్ మూవీకి రీమేక్. మలయాళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలో అందుబాటులో ఉంది.
ఆ సినిమాలను హిందీ జనాలు ఏమేర చూశారో తెలియదు కానీ.. హిందీ ‘దృశ్యం-2’ చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకైతే ఎగబడిపోతున్నారు. ఈ సినిమా వీకెండ్లో అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. వీకెండ్ తర్వాత కూడా వసూళ్లు నిలకడగానే ఉన్నాయి. చాన్నాళ్ల తర్వాత బాలీవుడ్‌కు దక్కిన విజయమిది. ఈ సినిమా ఊపు చూస్తే మలయాళంలో జీతు జోసెఫ్-మోహన్ లాల్ కలిసి ‘దృశ్యం-3’ తీయడం ఆలస్యం మళ్లీ రీమేక్ చేసేలా ఉన్నారు. ఈ పరిణామం రీమేక్‌ల విషయంలో బాలీవుడ్‌ను గందరగోళానికి గురి చేస్తోందనడంలో సందేహం లేదు.
This post was last modified on November 22, 2022 7:37 pm
వైసీపీలో ఇప్పటి వరకు ఓ మోస్తరు నేతలను మాత్రమే టార్గెట్ చేసిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు పెద్ద తలకాయల జోలికి…
ఎంత హీరోలతో పని చేస్తున్నా సరే ఆయా దర్శకులకు అంత సులభంగా వాళ్ళ ప్రేమ, అభిమానం దొరకదు. ఒక్కసారి దాన్ని…
ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ రోజు విడుదలవుతున్న ఆదిత్య 369 సరికొత్త హంగులతో థియేటర్లలో అడుగు పెట్టేసింది. ప్రమోషన్ల…
ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని రాష్ట్ర పాలనా యంత్రాంగానికి కీలక కేంద్రం అయిన సచివాలయంలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటిదాకా రాజకీయ నాయకులంటే……
కోర్ట్ రూపంలో ఇటీవలే బ్లాక్ బస్టర్ చవి చూసిన ప్రియదర్శి నెల తిరగడం ఆలస్యం ఏప్రిల్ 18న సారంగపాణి జాతకంతో…