టాలీవుడ్లో వివాదాలకు పూర్తి దూరంగా ఉండే నటుడు శ్రీకాంత్. సినిమాల పరంగా అయినా, వ్యక్తిగత జీవితంలో అయినా ఆయన నెగెటివ్ న్యూస్‌లతో వార్తల్లో నిలిచిన దాఖలాలు దాదాపు కనిపించవు. ఐతే ఆయన తన భార్య ఊహతో పాతికేళ్ల వివాహ బంధానికి తెరదంచేస్తున్నారని.. కొంత కాలంగా విభేదాల నేపథ్యంలో ఈ జంట విడాకులకు సిద్ధం అవుతోందని వెబ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో ప్రచారం జరగడం చర్చనీయాంశంగా మారింది.
ఎంతో అన్యోన్యమైన జంటలా కనిపించే శ్రీకాంత్-ఊహ మధ్య విబేదాలేంటి.. పైగా పిల్లలు ఎదిగి వచ్చాక ఈ వయసులో విడాకులేంటి అని అంతా ఆశ్చర్యపోయారు. ఐతే నిప్పు లేకుండా పొగ రాదు కదా అన్నట్లుగా కొందరు ఈ విషయాన్ని నమ్మడం మొదలుపెట్టారు. కానీ ఈ లోపే శ్రీకాంత్ స్పందించాడు. విడాకుల వార్తలపై ఆయన కొంచెం తీవ్రంగానే స్పందించారు.
తాను ఊహ కలిసి హ్యాపీగా ఉన్నామని, ప్రస్తుతం తాము ఒక టూర్‌లో ఉన్నామని ముందుగా ఒకరిద్దరు జర్నలిస్టులకు ఫోన్ చేసి క్లారిటీ ఇచ్చారు శ్రీకాంత్. ఆ తర్వాత ఆయన ఈ విషయమై మరింతగా మీడియాకు క్లారిటీ ఇచ్చారు.
“ఊహకు నేను విడాకులు ఇస్తున్నట్లు వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లలో ప్రచారం జరుగుతోంది. కొన్ని వెబ్ సైట్లలో ఈ ఫేక్ వార్తను చూసి ఊహ ఆందోళనకు గురైంది. ఈ ప్రచారంపై బంధువుల నుంచి ఫోన్లు వస్తుంటే వివరణ ఇచ్చుకోలేకపోతున్నా. నాపై అసత్య ప్రచారం చేస్తున్న వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తా. నిరాధారమైన వదంతులు ప్రచారం చేస్తున్న వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని శ్రీకాంత్ మీడియాకు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల గురించి మరీ ఈ స్థాయిలో దుష్ప్రచారం చేయడం బాధాకరమే.
This post was last modified on November 22, 2022 7:28 pm
ఒక ఇంట్లో దొంగ పడ్డాడు. నగలు, నట్రా దోచుకున్నాడు. యజమాని ... ఆ దొంగను గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.…
టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…
అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది…
తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి చేస్తున్న రాజకీయాలపై ఆసక్తికర…
ప్రస్తుతం విదేశీ విద్యకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఏపీ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి అమెరికా, ఉక్రెయిన్, రష్యా సహా..…
టీ20 మ్యాచ్‌లో 249 పరుగులు చేస్తే గెలుపు దాదాపు ఖాయమని అనుకుంటాం. కానీ వెస్టిండీస్ బ్యాటర్లు ఆ అంచనాలను తలకిందులు…