Movie News

హిట్ 3 అప్పుడే ఇన్ని లీకులా

వచ్చే నెల విడుదల కాబోతున్న హిట్ 2 ది సెకండ్ కేస్ మీద అంచనాలు మెల్లగా ఎగబాకుతున్నాయి. మేజర్ ప్యాన్ ఇండియా సక్సెస్ తర్వాత చేసిన మూవీ కావడంతో అడవి శేష్ ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. నిర్మాత నాని దసరాకు కాస్త బ్రేక్ ఇచ్చి మరీ ఆడియన్స్ కి చేరువ చేసేందుకు తన వంతు చేయాల్సింది పూర్తిగా ఇస్తున్నాడు. టీజర్ కట్ లో చూపించిన వయొలెన్స్ మీద యుట్యూబ్ నిబంధనలు విధించడంతో నెక్స్ట్ ట్రైలర్ లో ఏ స్థాయిలో కంటెంట్ ఉంటుందోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. క్రైమ్ లవర్స్ కి హిట్ 2 మీద మంచి హోప్స్ ఉన్నాయి.

ఇంకా ఇది రిలీజ్ కాకుండానే హిట్ 3కి సంబంధించిన లీకులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దాని ప్రకారం హిట్ 3ని మల్టీస్టారర్ గా రూపొందిస్తారట. అడవి శేష్ తో పాటు నాని, విజయ్ సేతుపతిలు ఇందులో భాగం పంచుకుంటారని వాటి సారాంశం. టైటిల్ లో మూడో నెంబర్ ఉంది కాబట్టి దానికి కనెక్ట్ అయ్యేలా ముగ్గురు హీరోలనే లాజిక్ తో దర్శకుడు శైలేష్ కొలను దీన్ని ప్లాన్ చేశారు కాబోలు. ఈ మధ్య జరిగిన ఈవెంట్లో శేష్ ఇచ్చిన క్లూ ఇదే అయ్యుండొచ్చు. హిట్ 2 ఎండ్ క్రెడిట్స్ లో నెక్స్ట్ సీక్వెల్ లో ఏ హీరో ఉంటాడో చెప్తామని అన్నాడు కదా బహుశా వీళ్ళనే రివీల్ చేయొచ్చు.

ఈసారి అమెరికా నేపథ్యంలో కథ నడవనుందని సమాచారం. అందరూ సూపర్ హీరోల మల్టీ వర్స్ తీస్తుంటే ఇలా క్రైమ్ డ్రామాతో కొనసాగింపులు చేయడం టాలీవుడ్ లో ఇదే మొదటిసారి. మాములుగా వెబ్ సిరీస్ లకు ఇలా జరుగుతుంది కానీ ఈ తరహా ప్రయోగాలు చేయడం మంచిదే. అయితే ఇదే హిట్ పార్ట్ 1 హిందీలో రీమేక్ చేసినప్పుడు డిజాస్టర్ కావడం అంతు చిక్కని విషయం. మరి ఇప్పుడీ తర్వాతి భాగాలను డబ్బింగ్ రూపంలో వదులుతారా లేదా మరోసారి రిస్క్ చేసి చూస్తారా అనేది వేచి చూడాలి. పర్ఫెక్ట్ రిలీజ్ టైమింగ్ తో వస్తున్న హిట్ 2కి టాక్ వస్తే మళ్ళీ హిట్టు పడ్డట్టే.

This post was last modified on November 22, 2022 11:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సజ్జల కాదు.. జగన్‌నే అసలు సమస్య..?

వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…

2 hours ago

వీడియో: అంబటి సంక్రాంతి సంబరాలు

భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…

3 hours ago

టైగర్ పవన్ కు మోడీ ప్రశంస

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మ‌రోసారి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నుంచి ప్రశంస‌లు ల‌భించాయి. గ‌తంలోనూ ప‌లు…

4 hours ago

‘చంద్ర‌బాబు ప‌నిరాక్షసుడు’

పండుగ అన‌గానే ఎవ‌రైనా కుటుంబంతో సంతోషంగా గ‌డుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట‌.. కొంత స‌మ‌యాన్ని ఫ్యామిలీకి…

7 hours ago

ఊపిరి పీల్చుకున్న విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…

10 hours ago

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

14 hours ago