కొన్ని సినిమాలు అలవోకగా అద్భుతమైన టాక్ తెచ్చుకుని మాంచి క్లాసిక్స్‌గా నిలిచిపోతాయ్. కాని కొన్ని సినిమాలకు టాక్ ఎలా ఉన్నా కూడా కలక్షన్లు వచ్చేస్తాయ్. ఈ రెండింటికీ మధ్యలో నిలిచింది స్టార్ హీరోయిన్ సమంత లేటెస్ట్ మూవీ ‘యశోద’. ఈ సినిమాతో సమంత ప్యాన్ ఇండియా హిట్ కొట్టేద్దాం అనుకుంది కాని, ఆ కోరికైతే నెరవేరలేదు. కాని మన హీరోయన్ మాత్రం కప్ నాదే అంటోంది. ఆ ఫీలింగ్‌లో నిజాయితీ కూడా ఉందిలే.
రిలీజైన రెండు వారాలకు గాను సమంత ‘యశోద’ సినిమా అన్ని బాషల్లో కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా ₹33 కోట్ల గ్రాస్ వసూళ్ళను రాబట్టింది. అంటే నిర్మాతలకు దాదాపు ₹18 కోట్ల షేర్ వస్తోందన్నమాట. ఆ లెక్కన అన్ని ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయినట్లే. అయితే ఈ హిట్టుతో సమంత స్టాటస్ అండ్ స్టార్డమ్ ఏ రేంజులో ఉందనేది చూస్తేనే.. సమంత 33 నాటౌట్ స్కోరుతో మ్యాచ్ కొట్టిందా లేదా అనే విషయం చెప్పడం సాధ్యమవుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఒక సోలో హీరోయిన్ సినిమా, అది కూడా ఏమాత్రం గ్లామర్ టచ్ కాని, ఎడల్ట్ కామెడీ కాని లేని సినిమా.. అసలు ఇంతవరకు రావడమే కష్టంగా ఉన్న రోజుల్లో.. సమంత సింగిల్ హ్యాండ్‌తో సినిమాను 33 కోట్ల గ్రాస్ కు తెచ్చేసిందంటే.. అది పెద్ద విషయమే. కంటెంట్ పవర్ ఎంతున్నా కూడా, తన స్టార్ పవర్ మాత్రం విపరీతంగా ఉందని ప్రూవ్ చేసింది.
అసలు సమంత ఏ మాత్రం ప్రమోట్ చేయకుండా.. కేవలం ఒక్క ఇంటర్యూ మరియు ఇనస్టాగ్రామ్ స్టోరీస్‌తో.. ఆ కంటెంట్‌ను ఇక్కడవరకు లాక్కొచ్చిందంటే పెద్ద విషయమే. ఒకవేళ ఇదే యశోదను సమంత ఊరూరా తిరిగి ప్రమోట్ చేసుంటే మాత్రం.. ఈ సినిమా బాక్సాఫీస్ కలక్షన్ల రేంజ్ ఇంకొంచెం ఎక్కువగానే ఉండేది. కాబట్టి.. 33 నాటౌ స్కోర్ తో సమంత మ్యాచ్‌ను గెలిపించి కప్ కొట్టిందనే చెప్పాలి.
This post was last modified on November 22, 2022 9:16 am
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి…
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…