Movie News

యంగ్ డైరెక్టర్ సెన్సేషన్ అయ్యేలా ఉన్నాడే..

ప్రశాంత్ వర్మ.. ఈ రోజు టాలీవుడ్లో ఇతనే హాట్ టాపిక్. ‘అ!’ అనే ప్రయోగాత్మక చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్.. ఆ తర్వాత ‘జాంబీరెడ్డి’ అనే జాంబీ మూవీ తీశాడు. ఈ సినిమాలను సూపర్ అనలేం. అలా అని తీసిపడేయలేం. ప్రశాంత్ అయితే డిఫరెంటుగా ఏదో చేయడానికి ప్రయత్నించాడు. ఆ చిత్రాలతో ఓ మోస్తరు ఫలితాన్ని అందుకున్నాడు. వీటి తర్వాత అతను ‘హనుమాన్’ అనే అడ్వెంచరస్ సూపర్ హీరో మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

తేజ సజ్జా లాంటి అప్‌కమింగ్ హీరోను పెట్టి పెద్ద బడ్జెట్లో, పాన్ ఇండియా లెవెల్లో సినిమా అనౌన్స్ చేసేసరికి ప్రశాంత్ మరీ అతి చేస్తున్నాడనిపించింది అందరికీ. కానీ ఈ రోజు లాంచ్ అయిన టీజర్ చూశాక అందరూ ముక్కున వేలేసుకున్నారు. 500 కోట్లు పెట్టి తీసిన ‘ఆదిపురుష్’ టీజర్ ఏ స్థాయిలో ట్రోల్స్‌కు గురైందో తెలిసిందే. కానీ అందులో పదో వంతు బడ్జెట్ కూడా లేని ‘హనుమాన్’లో విజువల్స్, గ్రాఫిక్స్ చూసి అందరూ షాకవుతున్నారు.

ప్రశాంత్ మామూలోడు కాదని, ‘హనుమాన్’ చిత్రంతో సెన్సేషన్ క్రియేుట్ చేసేలా ఉన్నాడని చర్చించుకుంటున్నారు. సూపర్ హీరోల సినిమాలంటే ఎప్పుడూ హాలీవుడ్ వైపే చూస్తుంటాం. కానీ హనుమంతుడి రూపంలో మనకు ఇంకా పెద్ద సూపర్ హీరో ఉన్నాడనే విషయాన్ని అతను గుర్తించి భారీ స్థాయిలో ఈ సినిమాను తీర్చిదిద్దిన తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. టీజర్లో చూపించిన తరహలోనే సినిమా ఉండి, అంచనాలను అందుకుంటే తెలుగులోనే కాదు పాన్ ఇండియా స్థాయిలో ‘హనుమాన్’ సంచలనం రేపడం ఖాయం.

ప్రశాంత్ ఈ సూపర్ హీరో సిరీస్‌లో ఇంకో రెండు సినిమాలు కూడా తీయబోతున్నాడట. తర్వాతి చిత్రానికి ‘అధీర’ అనే టైటిల్ కూడా ఖరారు చేశాడు. దాని తర్వాత ఒక లేడీ ఓరియెంటెడ్ సూపర్ ఉమన్ సినిమా తీస్తాడట. అందుకే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్ అంటూ పోస్టర్ల మీద వేస్తున్నాడు. ‘హనుమాన్’ ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.

This post was last modified on November 21, 2022 4:16 pm

Share

Recent Posts

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

2 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

5 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

10 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

11 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

11 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

11 hours ago