Movie News

త్రివిక్రమ్ వల్ల ఆమె కెరీర్ పోయిందట

90వ దశకంలో తెలుగులో వరుసగా సినిమాలు చేసిన కన్నడ నటి ప్రేమ గుర్తుందా? ‘దేవి’ సినిమాలో దేవతగా మెప్పించిన ఆమె విక్టరీ వెంకటేష్ ‘ధర్మచక్రం’ సహా చాలా సినిమాల్లో కథానాయికగా నటించి మెప్పించింది. ఐతే ఉన్నట్లుండి కథానాయికగా ఆమెకు ఆగిపోయాయి. ఆ తర్వాత ఆమె అక్క, వదిన లాంటి క్యారెక్టర్ రోల్స్‌కు మారిపోయింది.

ఐతే తనకు కథానాయికగా ఛాన్సులు తగ్గిపోయి, కెరీర్ దెబ్బ తినడానికి కారణం అప్పటి రచయిత, ఇప్పటి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసే అంటోంది ప్రేమ. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆరోపించడం గమనార్హం. ‘చిరునవ్వుతో’ సినిమాలో తనకు త్రివిక్రమ్ ఇచ్చిన పాత్రే కథానాయికగా తన కెరీర్ పాడవడానికి కారణమైందని ఆమె పేర్కొంది. తనకు ఈ పాత్ర గురించి చెప్పిన మాటలు వేరని, కానీ సినిమాలో చూస్తే ఆ పాత్ర ఇంకోలా ప్రెజెంట్ చేశారని ఆమె అంది.

‘చిరునవ్వుతో’ సినిమాకు కథ, మాటలు అందించింది త్రివిక్రమే. ఆ చిత్రంలో హీరో వేణుకు మరదలి పాత్రలో ప్రేమ నటించింది. హీరోను కాదనుకుని పెళ్లి పీటల మీది నుంచి వెళ్లిపోయిన ప్రేమ.. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ చేతిలో మోసపోయి తిరిగి ఇంటికి వస్తుంది. ఆమెకు వేణు అండగా నిలబడతాడు. ఈ సినిమాలో ఆమెది ఒక రకంగా చెప్పాలంటే ఏడుపుగొట్టు పాత్ర. ఐతే ఈ పాత్ర గురించి తనకు చెప్పినపుడు.. ఇందులో వేరే హీరోయిన్ ఉందా అని అడిగితే.. ‘‘లేదు, ఇందులో మీరే హీరోయిన్. కథ మొత్తం తన పాత్ర చుట్టూనే తిరుగుతుంది. కథలో కీలకం మీ పాత్రే’’ అని త్రివిక్రమ్ తనకు చెప్పాడని ప్రేమ వెల్లడించింది.

తీరా సినిమా చూస్తే తనది సహాయ పాత్ర అని, త్రివిక్రమ్‌ను నమ్మి ఆ సినిమా చేసినందుకు తన కెరీర్ దెబ్బ తిందని.. ‘చిరునవ్వుతో’ తర్వాత తనకు వరుసగా అలాంటి పాత్రలే వచ్చాయని, కథానాయికగా ఎదుగుతున్న దశలో తనకు ‘చిరునవ్వుతో’ సినిమాలో చేసిన క్యారెక్టర్ ప్రతికూలంగా మారిందని ఆమె అభిప్రాయపడింది.

This post was last modified on November 20, 2022 2:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బన్నీ ఉదంతం – ఆనందాన్ని కమ్మేసిన ఆందోళన!

సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…

3 minutes ago

నా సినిమా లేకపోయి ఉంటే OG ని తీసుకొచ్చేవాడిని : చరణ్

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…

38 minutes ago

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

3 hours ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

9 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

11 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

12 hours ago