ఎన్టీఆర్ కృష్ణ తర్వాత బాలయ్యే

స్టార్ హీరోలకు నటించడమే పెద్ద సవాల్. తమ ఇమేజ్ కు తగ్గ కథలను ఎంచుకుని దర్శకులను సెట్ చేసుకుని వాటికి తగ్గట్టు శారీరకంగా మానసికంగా సిద్ధపడటమనేది చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నది. అలాంటిది వాళ్లే దర్శకత్వం చేయడమనేది కలలో మాటే.

దీన్ని కొందరే సాధ్యం చేసి చూపించారు. అందులో మొదటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారకరామారావుగారు. దానవీరశూరకర్ణ లాంటి ఎపిక్ మూవీలో మూడు పాత్రలు వేసి నిర్మాణ బాధ్యతలతో సహా అన్నీ చూసుకుని నెలన్నర వ్యవధిలో అంత పెద్ద గ్రాండియర్ ని పూర్తి చేయడం ఇప్పటికీ రికార్డే. ఇలాంటి ఎన్నో గొప్ప చిత్రాలు అందించారాయన.

ఇక సూపర్ స్టార్ కృష్ణ చేసిన సాహసాలకు లెక్కే లేదు. 80ల నాటి బాహుబలిగా చెప్పుకునే సింహాసనంలో డ్యూయల్ రోల్ తో పాటు కోట్లాది బడ్జెట్ ని 70 ఎంఎంలో తెరకెక్కించిన తీరు గురించి అభిమానులు కథలుగా చెప్పుకుంటారు. అక్కినేని డైరెక్షన్ జోలికి వెళ్ళలేదు. శోభన్ బాబు ఏనాడూ కనీసం ఆలోచన కూడా చేయలేదు.

రెబెల్ స్టార్ కృష్ణంరాజు ప్రభాస్ తో ఒక్క అడుగు, భక్త కన్నప్ప ఈ రెండింటిలో ఒకదానితో మెగాఫోన్ పడదాం అనుకున్నారు కానీ వయసు రిత్యా సాధ్యపడలేదు. ఆ కోరిక తీరకుండానే కన్నుమూశారు. చంద్రమోహన్, మురళిమోహన్ టైపు మీడియం రేంజ్ హీరోలు సైతం ట్రై చేయలేదు.

పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణముర్తి, మాదాల రంగారావులాంటి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు కానీ కమర్షియల్ లీగ్ లోకి రారు కాబట్టి పరిగణనలోకి తీసుకోలేం. ఇప్పుడు బాలకృష్ణ వంతు వచ్చింది.

ఆదిత్య 369కి కొనసాగింపుగా ఆదిత్య 999 మ్యాక్స్ ని తన దర్శకత్వంలోనే తీస్తానని విశ్వక్ సేన్ ధమ్కీ ట్రైలర్ లాంచ్ లో మరోసారి స్పష్టం చేయడంతో అభిమానులకు మళ్ళీ దాని మీద ఆసక్తి మొదలైంది. గతంలో నర్తనశాల మొదలుపెట్టినప్పటికీ సౌందర్య మరణం వల్ల ఆపేసిన బాలయ్య ఈసారి మాత్రం సైన్స్ ఫిక్షన్ డ్రామాతో డైరెక్టర్ కుర్చీ ఎక్కడం కన్ఫర్మ్ అయ్యింది. వచ్చే ఏడాదన్నారు కానీ అనిల్ రావిపూడిది పూర్తి చేశాక ఉండొచ్చు