లైగర్ సినిమా రిలీజై మూడు నెలలు కావస్తోంది. కానీ ఆ సినిమా గురించి చర్చలు, వివాదాలు మాత్రం ఇంకా ఆగట్లేదు. ఆ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. సినిమా గురించి విజయ్, పూరి ఇచ్చిన బిల్డప్‌కి, తెర మీద చూసిందానికి ఏమాత్రం పొంతన లేకపోవడంతో రిలీజ్ టైంలో దాని మీద విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. కొన్ని రోజుల తర్వాత అంతా మూవ్ ఆన్ అయినట్లే కనిపించారు. బయ్యర్లకు కూడా నష్టపరిహారం సెటిల్ చేయడానికి పూరి ముందుకు రావడంతో ఆ సినిమా వ్యవహారం ముగిసిన కథగా భావించారు.
కానీ కొన్ని వారాల కిందట బయ్యర్లు.. పూరి ఆఫీస్ ముందు ఆందోళనకు సిద్ధం కావడం.. ఈ విషయం తెలుసుకున్న పూరి వారికి గట్టి వార్నింగ్ ఇచ్చిన ఫోన్ కాల్ లీక్ అవడం.. ఆ తర్వాత ఆయన బయ్యర్లు, ఫైనాన్షియర్ల మీద ఫిర్యాదు చేయడం.. వాళ్లు పూరి మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయడం తెలిసిందే.
ఆ తర్వాత ఆ వివాదం ఏమైందో ఏమో కానీ.. ఇప్పుడు ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్ దృష్టి ‘లైగర్’ టీం మీద పడిందనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఈ సినిమాలో కొందరు రాజకీయ నాయకులు బ్లాక్ మనీని పెట్టుబడిగా పెట్టారనే అనుమానం రావడంతోనే ఈడీ ఫోకస్ పెట్టిందట. ఈ సినిమాకు నిర్మాత కూడా అయిన పూరి జగన్నాథ్, ఆయన నిర్మాణ భాగస్వామి ఛార్మి కౌర్‌లను పిలిచి విచారిస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఫారిన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా)ను ‘లైగర్’ టీం అతిక్రమించిందని.. పెట్టుబడుల విషయంలో చాలా అనుమానాలున్నాయని, అందుకే ఈడీ అధికారులు ఈ చిత్ర నిర్మాతలైన పూరి, ఛార్మిలను విచారిస్తున్నారని అంటున్నారు. మరి రాజకీయ నేతలు సినిమాలో బ్లాక్ మనీని పెట్టుబడిగా పెట్టారనే ఆరోపణలే నిజం అయితే బయ్యర్లకు సెటిల్మెంట్ విషయంలో అంత గొడవ జరగడం ఆశ్చర్యకరం. మరి ఈ విచారణలో ఈడీ అధికారులు ఏం తేలుస్తారో చూడాలి.
This post was last modified on November 17, 2022 10:36 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…