Rx 100 Director Ajay
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించాడు అజయ్ భూపతి. వర్మ శిష్యుడి సినిమా అంటే కొన్నేళ్ల నుంచి ఆయన తీస్తున్న లో లెవెల్ సినిమాల్లాగే ఉంటుందని అనుకున్నారు.ఈ సినిమా ప్రోమోలు కూడా కొంచెం తేడాగానే అనిపించాయి. కానీ విషయం ఉన్న సినిమా కావడం, అందులో హీరోయిన్ పాత్రకు సంబంధించిన ట్విస్టు బ్రహ్మాండంగా పేలడంతో ప్రేక్షకులకు మంచి కిక్కు వచ్చింది. సినిమా బ్లాక్‌బస్టర్ అయింది. అజయ్ మీద అంచనాలు భారీగా పెరిగాయి.
అతడి రెండో సినిమా ‘మహాసముద్రం’కు మంచి హైపే వచ్చింది. శర్వానంద్, సిద్దార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయెల్.. ఇలా మంచి కాస్ట్ కుదిరింది. పెద్ద బడ్జెట్లో సినిమాను నిర్మించారు. కానీ అన్నీ ఉన్నా సినిమాలో అసలు విషయం తేడా కొట్టడంతో అజయ్ ఒకేసారి దబేల్‌మని కింద పడ్డాడు. ద్వితీయ విఘ్నాన్ని దాటలేకపోయిన అజయ్‌కి మళ్లీ ఇంకో సినిమా దక్కించుకోవడం కష్టమే అయింది.
ఐతే ఇప్పుడు అజయ్ స్వీయ నిర్మాణంలో ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం. తన మిత్రులతో కలిసి అతను ఈ సినిమాను నిర్మిస్తున్నాడట. ‘మంగళవారం’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు చెబుతున్నారు. రెండో సినిమాలా కమర్షియల్ లెక్కలు వేసుకోకుండా.. తొలి చిత్రం మాదిరి ప్రయోగాత్మక శైలిలో ఈ సినిమా చేయాలని అజయ్ ఫిక్సయ్యాడట.
ఇందులో ముఖ్య పాత్రలు కొంచెం ఎక్కువ సంఖ్యలోనే ఉంటాయట. ఆర్టిస్లుల వివరాలు అయితే ఏమీ వెల్లడి కాలేదు. ‘మంగళవారం’ అనే టైటిల్ అనగానే ఈ సినిమాపై రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. మంగళవారాన్ని కొందరు అశుభ సూచకంగా భావిస్తారు. ఆ రోజు ఏ పనీ చేయరు. కొందరేమో అది మంగళకరమైన రోజు కాబట్టి ఆ పేరు పెట్టారని సానుకూల ధోరణితో చూస్తారు. ఇక ‘మంగళవారం’ మీద ఒక బూతు సామెత కూడా ఉంది. మరి అజయ్ ఏ కోణంలో ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టారన్నది ఆసక్తికరం.
This post was last modified on November 17, 2022 4:36 pm
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…