కేవలం 16 కోట్ల బడ్జెట్ తో రూపొంది ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు వందల కోట్ల గ్రాస్ వసూళ్లకు దగ్గరగా ఉన్న శాండల్ వుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కాంతార ఎప్పుడెప్పుడు ఓటిటిలో వస్తుందాని ఎదురు చూస్తున్న ప్రేక్షకుల సంఖ్య లక్షల్లో కంటే కోట్లలో ఉందని చెప్పడం సబబుగా ఉంటుంది. థియేటర్ లో చూసిన వాళ్ళు మరొక్కసారి వీక్షించేందుకు ఎదురు చూస్తుండగా, ఆ ఎక్స్ పీరియన్స్ మిస్ అయినవాళ్లు అసలు అంతగా ఏముందో తేలుద్దామని వెయిట్ చేస్తున్నారు. బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్స్ కు ఈ మధ్య డిజిటల్ ప్రీమియర్స్ లో మిశ్రమ స్పందన వస్తున్న సంగతి తెలిసిందే.
కాంతారను అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 24 గురువారం నుంచి చూసేయొచ్చు. అధికారిక ప్రకటన రానుంది. కొద్దిరోజులు రెంట్ పెడతారా లేక అందరికీ ఓపెన్ స్ట్రీమింగ్ ఇస్తారానేది వేచి చూడాలి. వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కర్ణాటకలో ఇప్పటికీ స్ట్రాంగ్ గా రన్ అవుతున్న కాంతార ఇటీవలే కెజిఎఫ్ 2 నెలకొల్పిన టాప్ వన్ 175 కోట్ల గ్రాస్ ని కర్ణాటకలో దాటేసింది. అత్యధిక రెండు కోట్ల ఫుట్ ఫాల్స్ సైతం దీని పేరు మీదే ఉన్నాయి. యాభై రోజులు దాటినా హౌస్ ఫుల్స్ పడటమనేది కెజిఎఫ్ 2కే జరగలేదని అలాంటిది కాంతార చేసింది అరుదైన ఫీట్ కాదని చెప్పలేం
తెలుగులో ఇటీవలే మూడున్నర కోట్లకు శాటిలైట్ డీల్ జరగడం మరో సంచలనం. హోంబాలే ఫిలిమ్స్ సుడి ఈ సంవత్సరం మాములుగా లేదు. బంగారు బాతులను పెంచుకున్నట్టు తీసిన ప్రతి సినిమా కనక వర్షం కురిపిస్తోంది. ఏపి తెలంగాణ కలిపి యాభై కోట్ల గ్రాస్ దాటించమంటే మాటలు కాదు. పైగా ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా వాటిని తట్టుకుంటూ తొక్కుకుంటూ పోవాలే సూత్రాన్ని ఫాలో అయిన కాంతారను కొన్ని కర్ణాటక సెంటర్స్ లో వంద రోజులు ఆడించే ప్రణాళిక ఉందట. ఈ వారం సర్దార్, గాడ్ ఫాదర్ లతో ఎంజాయ్ చేస్తే వచ్చే వారం ఓటిటిలో కాంతార కనువిందు చేయనుంది.
This post was last modified on November 17, 2022 2:05 pm
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…