కంటెంట్ క్వాలిటీ ఎలాగైనా ఉండనీ.. జనాల్ని ఏదో రకంగా ఆకర్షించి డబ్బులు చేసుకోవడంలో రామ్ గోపాల్ వర్మను మించిన వాళ్లు లేరు. ఆయన సినిమా ఒకటి చూసి చెడామడా తిట్టుకుని, ఇంకెప్పుడూ వర్మ సినిమా చూడకూడదు అని బలంగా నిర్ణయించుకున్న వాళ్లను మళ్లీ ఏదో రకంగా ఆకర్షించి తన కొత్త సినిమా చూసేలా చేయగల దిట్ట వర్మ. షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూత పడ్డ ఈ లాక్ డౌన్ టైంలో కూడా ఆయన.. సినిమాలు తీస్తున్నారు. తన ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’ ద్వారా ఆన్ లైన్లో రిలీజ్ చేసి సొమ్ము చేసుకుంటున్నాడు.
పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్’ అనే బూతు సినిమాకు రూ.100 రేటు పెట్టి కోట్లలో సంపాదించిన వర్మ.. ఆ తర్వాత ‘నేక్డ్’ పేరుతో లోకల్ బూతు బొమ్మకు రూ.200 రేటు పెట్టి దాని ద్వారా కూడా బాగానే ఆర్జించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఆన్ లైన్ థియేటర్లో రిలీజ్ కాబోతున్న కొత్త సినిమా ‘పవర్ స్టార్’. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసిన సినిమా ఇదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ కెరీర్లో మైలురాయిలా నిలిచిన ‘తొలి ప్రేమ’ రిలీజైన జులై 24నే ఈ చిత్రం కూడా రిలీజవుతుందని వర్మ చెప్పిన సంగతి తెలిసిందే.
ఐతే త్వరలో ‘పవర్ స్టార్’ ట్రైలర్ వదలబోతున్నాడు వర్మ. కానీ అందరిలా దాన్ని యూట్యూబ్‌లో ఫ్రీగా చూపించేయట్లేదు వర్మ. ఆ ట్రైలర్ చూడటానికి కూడా రేటు పెడుతున్నాడట. రూ.50 దాకా డబ్బులు పెడితే తప్ప ఆ ట్రైలర్ చూడలేరట. ప్రపంచంలో ఇలా ట్రైలర్‌ను కూడా అమ్మకానికి పెట్టిన తొలి ఫిలి మేకర్ వర్మే కావచ్చు. సినిమా చూడాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి అందరూ ట్రైలర్ చూస్తారు. దాన్ని ఎక్కువమంది చూస్తే సినిమాకు ప్రయోజనం అని ఫిలిం మేకర్స్ భావిస్తారు. కానీ దానికి కూడా రేటు పెట్టాలన్న వర్మ ఆలోచన అనూహ్యం.
This post was last modified on July 14, 2020 2:37 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…