నవంబరు బాక్సాఫీస్ అనుకున్నట్లుగానే డల్లుగా నడుస్తోంది. తొలి వారంలో విడుదలైన ‘ఊర్వశివో రాక్షసివో’ పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇక గతవారం విడుదలైన ‘యశోద’ పరిస్థితి అంత గొప్పగానూ లేదు. అలాగని తీసిపడేసేలాగా కూడా లేదు. వీకెండ్ వరకు బాగానే ఆడిన సినిమా.. ఆ తర్వాత డల్లయింది. ఇక ఈ వారానికి చెప్పుకోదగ్గ సినిమాలే కనిపించడం లేదు.
వేరే సమయాల్లో థియేటర్ల దొరక్క ఇబ్బంది పడుతున్నా ప్రతి వారం ఇబ్బడిముబ్బడిగా సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. కానీ ఈ వారానికి బోలెడన్ని థియేటర్లు అందుబాటులో ఉన్నా కొత్త సినిమాలు ఆసక్తి చూపించట్లేదు. ‘మసూద’ అనే హారర్ మూవీ మాత్రమే చెప్పుకోదగ్గ రిలీజ్. ఈ వారం సరైన పోటీ లేకపోవడం చూసి తమిళ బ్లాక్ బస్టర్ ‘లవ్ టుడే’ను రిలీజ్ చేయడానికి అగ్ర నిర్మాత దిల్ రాజు రెడీ అయ్యాడు.
తమిళంలో ఈ నెల 4న రిలీజై అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్తుండడంతో ఆలస్యం చేయకుండా తెలుగు డబ్బింగ్ హక్కులు తీసుకుని చకచకా సినిమాను రిలీజ్‌కు రెడీ చేయించాడు రాజు. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా లాంచ్ కావాల్సింది. కానీ సూపర్ స్టార్ కృష్ణ హఠాన్మరణంతో ఆ కార్యక్రమం ఆపేశారు. ఇప్పుడు టాలీవుడ్ ఉన్న విషాదభరిత మూడ్‌లో ‘లవ్ టుడే’ సినిమాను ప్రమోట్ చేయడం, హడావుడి చేయడం బాగుండదని భావించి రాజు మొత్తంగా రిలీజ్ విషయంలోనే వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
ఇంకో రెండు రోజుల్లో రిలీజ్ అనగా ఈ సినిమాకు బుకింగ్స్ ఓపెన్ కాలేదు. దీన్ని బట్టి ఈ వారం సినిమా రిలీజ్ కావట్లేదని స్పష్టం అవుతోంది. ఈ చిత్ర హీరో హీరోయిన్లు మనవాళ్లు పరిచయం లేదు. మన జనాలకు ఈ సినిమా గురించి కూడా పెద్దగా తెలియదు. అలాంటపుడు ప్రమోషన్ల పరంగా హడావుడి చేస్తే తప్ప జనాల్లోకి సినిమా వెళ్లదు. కృష్ణ మరణం నేపథ్యంలో అలాంటి హడావుడి బాగుండదనే రాజు సినిమా విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వచ్చే వారం సినిమా రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
This post was last modified on November 16, 2022 12:30 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…