భారతీయ చలన చిత్ర చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణది ఓ సువర్ణాధ్యాయం. నటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టి వ్యక్తి నుండి వ్యవస్థగా మారిన బంగారు మనిషి కృష్ణ.
మహా నటుడు ఎన్టీయార్, ఏయన్నార్ అడుగు జాడల్లో నడుస్తూ, శోభన్ బాబుతో కలిసి తెలుగు సినిమా రంగానికి నాలుగో స్థంబంలా నిలిచారాయన. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, ఎడిటర్ గా అన్ని రంగాలపైనా పట్టు సంపాదించుకుని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, బెంగాలీ, హిందీ భాషలలోనూ పలు చిత్రాలను నిర్మించారు.
300కు పైగా చిత్రాలలో నటించారు. తెలుగు తెరపై ఆయనే తొలి కౌబోయ్, ఆయనే మొదటి జేమ్స్ బాండ్, ఆయనే ఫస్ట్ సినిమా స్కోప్ హీరో, ఆయనే ప్రథమ 70 ఎం. ఎం. మూవీ డైరెక్టర్ కమ్ హీరో… చిత్రసీమలో డేరింగ్ డాషింగ్ అనే పదాలకు నిలువెత్తు నిర్వచనం కృష్ణ. ఆయన మరణం కోట్లాది మంది అభిమానులను దుఃఖ సాగరంలో ముంచింది. సూపర్ స్టార్ కృష్ణ లేని లోటు పూడ్చలేనిది. ఆయన మృతికి తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అందరి సభ్యుల తరుపున అధ్యక్ష కార్యదర్శులు వి. లక్ష్మీనారాయణ, వై. జె. రాంబాబు తీవ్ర సంతాపాన్ని తెలియచేశారు.
ఒకే యేడాది సోదరుడిని, తల్లిదండ్రులను కోల్పోయిన మహేశ్ బాబుకు, ఘట్టమనేని ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కష్టకాలాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఇవ్వాలని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రార్థిస్తోంది.
This post was last modified on November 15, 2022 7:02 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…