Movie News

కృష్ణ – ది గ్రేట్

తెలుగు సినీ వినీలాకాశంలో మరో ధృవతార రాలిపోయింది. సినీ ప్రియుల హృదయాల్లో గూడుకట్టుకుని ఉన్న సూపర్ స్టార్ కృష్ణ…. భువిని వదిలి కమనీయ లోకాలకు తరలిపోయారు.. 80 పదుల కృష్ణ తన నట జీవితంలో ఎన్నో మైలు రాళ్లను అధిగమించారు. కృష్ణ ఇక లేరనే సమాచారం తెలిసిన వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదం నెలకొంది…

సినీ జనానికే ఆదర్శం

ఆదర్శ కథానాయకుడు కృష్ణ …మధ్య తరగతి వర్గానికి కనెక్టయ్యే సినిమా క్యారెక్టర్.. కృష్ణ ….ఊహాలోకాల్లో తేలే యువతను మరింత ఉర్రూతలూగించే హీరో కృష్ణ. ప్రేక్షుకుడు తనను తాను చూసుకునే నడుడు కృష్ణ. నిన్న నేడు, రేపు ఎప్పుడైనా ఒకేలా ఉండే సినిమా మనిషి కృష్ణ. పిలిస్తే పలికే నాయకుడు కృష్ణ. జనంలో తను.. తనలో జనం అన్నట్లుగా కలిసిపోయిన వ్యక్తిత్వం కృష్ణ.. అందుకే మన బుర్రుపాలెం బుల్లోడి ఈజ్ గ్రేట్…

తేనెమనసుల చిన్నోడు

కృష్ణ 1943, మే 31వ తేదీన గుంటూరు జిల్లాలోని తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించారు.. 1960లో ఏలూరు సి.ఆర్‌.రెడ్డి. కాలేజీలో బిఎస్సీ పూర్తి చేశారు. నటుడు మురళీమోహన్ ఆయన క్లాస్ మేట్ కృష్ణ నటించిన తొలి చిత్రం తేనె మనసులు. ఇప్పటి వరకు 340కి పైగా చిత్రాల్లో నటించారు. గూఢచారి 116తో ఇండస్ట్రీలో ఆయనకు గుర్తింపు లభించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో నటశేఖరుడు ట్రెండ్‌సెట్టర్‌ అనిపించుకున్న సందర్భాలు కోకొల్లలు. 1964-95 మధ్య ఏడాదికి 10 సినిమాల చొప్పు.. 300 సినిమాలు చేశారు. సినిమాల నటించడంతో పాటు డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌గానూ పనిచేశారు. 18 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. 1969లో ఒకే ఏడాది ఆయన 19 సినిమాలు చేశారు. కృష్ణ ఎనర్జీ అలాంటిది. మూడు షిప్టులు పనిచేసినా అలసిపోకుండా మరుసటి రోజు ఎంతో చలాకీగా కనిపించే కృష్ణను చూసి తోటి నటులు ఆశ్చర్యపోయేవారు…

ఘట్టమనేని వారి కృష్ణ తత్వం

ఆయన జేమ్స్ బాండ్, ఆయన కౌబాయ్… ఆయన గూఢాచారి 116, ఆయన అల్లూరి సీతారామరాజు, అంతకు మించి ఆయన కుమారరాజా.. ఆయన సినిమాల్లో మాత్రమే మోసగాళ్లకు మోసగాడు. దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రయోగాలకు ఆద్యుడు ఆయన. 70 ఎంఎం…సినిమా స్కోప్, ఈస్టమన్ కలర్ ఏది చెప్పాలనుకున్నా ఠక్కున గుర్తొచ్చేది ఘట్టమనేని వారి పేరే… తెలుగువీర లేవరా అంటూ.. అణచివేతపై పోరాడే సాహసాన్ని నేర్పింది కూడా ఆయనే… కృష్ణ ప్రయోగాలకు వెనుకాడరు. వైఫల్యాలకు కృంగిపోరు. ఎవరో ఏదో అంటారని భయపడరు. నమ్మింది చేయడమే కృష్ణతత్వం. తెలుగు పాటకు తొలి జాతియ పురస్కారం అందుకున్నది కూడా కృష్ణ సినిమానే..

గూఢచారి 116 సినిమా సక్సెస్ తో కృష్ణ కెరీర్ పరుగులు తీసింది. ఆంధ్రా జేమ్స్ బాండ్ కు ఏకంగా 20 సినిమాల ఆఫర్లు వచ్చాయి. వెరైటీ సినిమాలు చేస్తూనే మరో ఆరు జేమ్స్ బాండ్ సినిమాల్లో హీరోగా నటించారు. బాపు నిర్మించిన సాక్షి… కృ,ష్ణ ఇమేజ్ ను అమాంతం పెంచేసింది. ఆయన సహధర్మచారిణి విజయ నిర్మల నటించిన మొదటి చిత్రం కూడా అదే…

నాలుగు దశాబ్దాల పాటు 340 చిత్రాల్లో కృష్ణ నటించారు. కృష్ణ ఆయన అసలు పేరు అయితే డేరింగ్ అండా డాషింగ్ హీరో ఆయన మరో పేరు. పద్మాలయ ఏర్పాటుతో సిని నిర్మాణంలోనూ ఊపు వచ్చింది. కృష్ణకు ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ బహుశా తెలుగులో ఏ ఇతర నటుడికి ఉండకపోవచ్చు. పెద్ద పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో కృష్ణకు వేల సంఖ్యలో ఫ్యాన్స్ ఉండేవారు. వారానికి ఒక సినిమా రిలీజవుతున్నా.. అంతే స్తాయిలో ఫ్లాపులు ఎదురవుతున్నా.. ఫ్యాన్స్ ధైర్యం మాత్రం చెక్కుచెదిరేది కాదు.. నెక్స్ట్ మూవీ సూపర్ హిట్ అని చెప్పుకునేవారు.

తెలుగులో రీమేక్‌ చిత్రాల్లో ఎక్కువగా నటించిన ఘనత సూపర్‌స్ట్టార్‌ కృష్ణదే. ఆయన మొత్తం 54 రీమేక్‌ చిత్రాల్లో నటించి రికార్డ్‌ క్రియేట్‌ చేసారు. ఇందులో హిందీ రీమేక్‌ చిత్రాలు 17 ఉన్నాయి. బాలీవుడ్‌ నటుడు, నిర్మాత, దర్శకుడు రాజ్‌ కపూర్‌ నటించిన ‘అనాడి’ ఆధారంగా రూపుదిద్దుకున్న ‘అమాయకుడు’ చిత్రంలో హీరో కృష్ణ నటించారు. తన కంటే సీనియర్‌ అయిన జమునతో ఆయన కలిసి నటించిన తొలి చిత్రం అదే. మరాఠీలో రూపు దిద్దుకుని ఆరు అవార్డులు పొందిన ‘అపరాధ్‌’ చిత్రం ఆధారంగా రూపొందిన ‘గూడు పూటానీ’ చిత్రంలో హీరో కృష్ణ, శుభ జంటగా నటించారు. ఆర్వో కలర్‌లో తీసిన తొలి సినిమా ఇదే. పాపులర్‌ సాంగ్‌ ‘తనివి తీరలేదే’ ఈ సినిమా లోదే. విజయా సంస్థలో హీరో కృష్ణ నటించిన తొలి చిత్రం ‘గంగ మంగ’. హిందీలో హిట్‌ అయిన ‘సీత ఆవుర్‌ గీత’ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేశారు. శోభన్‌ బాబు మరో హీరోగా నటించారు.

నిజానికి తెలుగు సినీ ప్రపంచంలో కృష్ణ ఒక గ్లామర్ బాయ్. ఆయన దుస్తులు, ఆయన నడక, ఆయన నడత … నాటి యువత ఫాలో అవుతూ ఉండేది. ఇండస్ట్రీలో ఆయన నాలుగో స్థంభం. ఎన్టీయార్ తిరుగులేని కథానాయకుడిగా ఉన్నా… అక్కినేని, శోభన్ బాబులకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నా… కృష్ణ మాత్రం తన స్టయిలే వేరని చెప్పేవారు. ఒక్క సారి కృష్ణ ఫ్యాన్ క్లబ్ లో చేరిన వాళ్లు ఆయన నటనను ఆస్వాదిస్తూ అలా ఉండిపోయేవారు. ఫ్యాన్స్ ను కృష్ణ తన కుటుంబ సభ్యులుగా చూసుకునేవారు. 24 గంటలూ తన అభిమానులకు అందుబాటులో ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే అదీ కృష్ణ అనే చెప్పాలి.

వరుస ట్రాజెడీలు

కృష్ణకు ఇద్దరు భార్యలు. ఇందిరా దేవి, విజయనిర్మల. 2019లో విజయనిర్మల చనిపోయారు. ఇందిరా దేవి ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఇద్దరు కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబు, కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. రమేష్ బాబు ఈ ఏడాది జనవరి 8వ తేదీన కిడ్నీ సంబంధిత ఇబ్బందులతో మరణించారు. 80వ పడిలోకి అడుగుపెడుతున్న తరుణంలో కృష్ణ కన్నుమూశారు. ఆయన నట వారసత్వం మాత్రం మహేష్ బాబు రూపంలో కొనసాగుతోంది..

This post was last modified on November 15, 2022 12:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బ్లాక్ బస్టర్ పాటలకు పెన్ను పెట్టకుండా ఎలా?

వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…

1 hour ago

పవన్… ‘ఒక్కరోజు విలేజ్’ పిలుపు ఫలించేనా?

నెల‌లో ఒక్క‌రోజు గ్రామీణ ప్రాంతాల‌కు రావాలని.. ఇక్క‌డి వారికి వైద్య సేవ‌లు అందించాల‌ని డాక్ట‌ర్ల‌కు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్…

5 hours ago

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

10 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

11 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

11 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

12 hours ago