నందమూరి బాలకృష్ణ. ‘ఆహా’ ఓటిటి కోసం ఆయన టాక్ షో చేయకముందు ఆయనుకున్న ఇమేజ్ వేరు. ‘అన్‌స్టాపబుల్’ అంటూ ప్రోగ్రామ్ చేశాక ఆయన రేంజ్ వేరు. తనలోని డీప్ కార్నర్‌ను జనాలకు చూపించేసి ఈ మధ్య కొత్తగా యూత్ అండ్ ఫ్యామిలీస్ ఫాలోయింగ్‌ను విపరీతింగా సంపాదించారు ఈ సీనియర్ హీరో. అయితే ఇప్పుడు ఆయన అన్ స్టాపబుల్ కోసం.. సదరు టీమ్ కష్టం అంతా ఇంతా కాదట. ఎందుకంటే పెద్ద రీజనే ఉంది మరి.
నిజానికి బాలయ్య షో అనగానే మొదటి సీజన్ అంతా ఆయన ఎలా మాట్లాడతారు, ఏం మాట్లాడతారు అనే అంశాలపై చాలా ఆసక్తి ఉండేది. రెండో సీజన్ వచ్చేసరికి, అసలు ఆయన ఎటువంటి కాంబినేషన్ గెస్ట్స్‌ను ఇంటర్యూ చేస్తారు ఎవరితో ఏం మాట్లాడిస్తారో అనే కుతూహలం బాగా పెరిగిపోయింది. నారా చంద్రబాబు అండ్ లోకేష్ కాంబినేషన్ ఒక స్టన్నింగ్ ఎపిసోడ్ అయితే, శర్వా-శేష్, విశ్వక్-సిద్దూ.. కాంబినేషన్ కూడా అదిరిపోయింది. దానితో ఇప్పుడు అన్‌స్టాపబుల్ బ్యాక్-ఎండ్ టీమ్ అంతా ఈ కాంబినేషన్ల కోసం చాలా కసరత్తులే చేస్తున్నారట. ప్రతీ కాంబినేషన్ సెట్ చేశాక, వాటి గురించి బాలయ్యకు చెప్పి, ఆయన ఎప్రూవల్ కూడా తీసుకున్న తరువాతనే సదరు సెలబ్రిటీస్‌ను ఎప్రోచ్ అవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఒక హిట్ షో కోసం కాంబినేషన్ గెస్టులను పిలవడం ఎంత కష్టమో చూడండి.
అయితే ఈ అన్‌స్టాపబుల్‌లో.. చిరంజీవి-పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్-అల్లు అర్జున్, సమంత-రష్మిక వంటి కాంబినేషన్స్ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. కాకపోతే త్వరలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరియు ఆయన సోదరుడు రానున్నారనే టాక్ వినిపిస్తోంది. ఏదైమైనా కూడా బాలయ్య షో అంటే ఆ మాత్రం హైప్ అండ్ క్యురియాసిటీ ఉండదేంటి.
This post was last modified on November 15, 2022 10:21 am
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…