ప్రేక్షకులను, అభిమానులను మెప్పించడానికి హీరోలు ఎంత కష్టపడతారో తెలిసిందే. పాత్రకు తగ్గట్లు శరీరాకృతి మార్చుకునేందుకు కొందరు హీరోలు పడే కష్టం అలాంటిలాంటిది కాదు. ఇంతకుముందులా మామూలు బాడీతో కనిపిస్తే ఇప్పుడు ప్రేక్షకులు ఆమోదించే పరిస్థితి లేదు. చాలా ఫిట్‌గా కనిపించాలి. కుదిరితే ప్యాక్స్ పెంచాలి. ఇలా టాలీవుడ్ హీరోల్లో సిక్స్ ప్యాక్స్ చేసిన హీరోలు చాలామందే ఉన్నారు. ఐతే ఈ ప్యాక్స్ కోసమని కొందరు హీరోలు హద్దులు దాటి కష్టపడుతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది.
తాజాగా యంగ్ హీరో నాగశౌర్య.. ప్రేక్షకులకు షాకిచ్చేలా శరీరాకృతిని మార్చుకునే ప్రయత్నంలో ఆసుపత్రి పాలవడం చర్చనీయాంశం అవుతోంది. తాను నటిస్తున్న ఓ కొత్త సినిమా షూట్ కోసమని నాగశౌర్య యాబ్స్ పెంచే ప్రయత్నంలో ఉన్నాడట. అవి బాగా ఎలివేట్ కావడం కోసం మూడు రోజులుగా నో వాటర్ డైట్ మీద ఉన్నాడట.
మూడు రోజులు మంచినీళ్లు తాగకపోవడంతో సోమవారం అతను డీహైడ్రేట్ అయిపోయి కళ్లు తిరిగి సెట్స్‌లో కిందపడిపోయాడట. వెంటనే అతణ్ని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం డిశ్చార్జి చేశారు. ఇప్పుడు నాగశౌర్యకు తలెత్తింది చిన్న సమస్యే కావచ్చు. కానీ బాడీలు పెంచే క్రమంలో మరీ హద్దులు దాటితే ఏమవుతుందో చెప్పడానికి ఇది ఒక హెచ్చరిక లాంటిదే.
ఈ మధ్య జిమ్‌లో వర్కవుట్లు చేస్తూ, పరిమితికి మించి బరువులు మోస్తూ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన వారి ఉదంతాలు తరచుగా వింటున్నాం. ఇటీవలే ఒక హిందీ సీరియల్ నటుడు కూడా అలాగే ప్రాణాలు వదిలాడు. అతి సర్వత్ర వర్జయేత్ అనడానికి ఇదొక రుజువు. కాబట్టి ప్రేక్షకులను మెప్పించాలని హీరోలు పరిమితికి మించి కష్టపడడం మంచిది కాదు.
This post was last modified on November 14, 2022 9:10 pm
గ్రామ పంచాయతీలపై జనసేన పార్టీ పట్టు బిగించే దిశగా అడుగులు వేస్తోంది. చేస్తున్న అభివృద్ధి, ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలను…
అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో చదివిన మనవాళ్లు డిగ్రీ చేతికి రాగానే పెట్టేబేడా సర్దుకుని వెనక్కి రావాల్సి వస్తోంది. ఎంత టాలెంట్…
హెచ్ఐవీ పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం దీనిపై చైతన్యం తీసుకువచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తూ హెచ్ఐవి వ్యాప్తి…
అసలే బజ్ విషయంలో వెనుకబడి హైప్ కోసం నానా తంటాలు పడుతున్న వా వతియార్ (తెలుగులో అన్నగారు వస్తారు) విడుదల…
భారీ అంచనాల మధ్య ఓ పెద్ద హీరో సినిమా రిలీజైందంటే బాక్సాఫీస్ దగ్గర ఉండే సందడే వేరు. ఐతే ఈ…
గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి చాలా ఏళ్ల నుంచి అమ్మాయిలకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి అలుపెరగని పోరాటం చేస్తున్న…