Movie News

ఇది సమంత పవర్

నవంబరు నెలలో కొన్నేళ్ల నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ ఆశాజనకంగా ఉండట్లేదు. టాక్ బాగున్న సినిమాలకు కూడా వసూళ్లు రావట్లేదు. ఈ నెల మొదటి వారంలో రిలీజైన ‘ఊర్వశివో రాక్షసివో’కు మంచి టాక్ వచ్చింది. అది యూత్‌ను ఆకట్టుకునే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. అయినా సరే.. ఆ చిత్రానికి ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు.

వీకెండ్లోనే ఓ మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకున్న ఆ చిత్రం.. ఆ తర్వాత మరింత డల్ అయిపోయింది. ఇలాంటి టైంలో సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘యశోద’ గత వీకెండ్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మీద మరీ హైప్ ఏమీ లేదు. అలాగని ప్రేక్షకులు పట్టించుకోకుండా కూడా ఏమీ లేదు. ఐతే సినిమాకు పాజిటివ్ టాక్ రావడం కీలకంగా భావించారు. కానీ ‘యశోద’ డివైడ్ టాక్‌తో మొదలైంది. కాన్సెప్ట్ బాగున్నా, కొత్తగా అనిపించినా.. ఆశించినంత ఆసక్తికరంగా దాన్ని ప్రెజెంట్ చేయలేదనే అభిప్రాయం వ్యక్తమైంది.

ఇలాంటి టాక్‌తో ‘యశోద’ ఏమాత్రం బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుందో అనుకున్నారు. కానీ ఇక్కడే సమంత బాక్సాఫీస్ స్టామినా అక్కరకు వచ్చింది. తొలి రోజు వరల్డ్ వైడ్ రూ.3 కోట్ల షేర్ రాబట్టి ఆశ్చర్యపరిచింది సమంత. నాగ్ సినిమా ‘ది ఘోస్ట్’, నాగచైతన్య మూవీ ‘థాంక్యూ’ కంటే ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ ఎక్కువ కావడం విశేషం. ఐతే టాక్ బాగా లేని సినిమాకు వసూళ్లు ఒక్కసారిగా డ్రాప్ అవుతాయి కానీ.. ‘యశోద’కు మాత్రం కలెక్షన్లు కాస్త నిలకడగానే ఉన్నాయి. 2, 3 రోజుల్లోనూ తొలి రోజుకు దీటుగా వసూళ్లు రాబట్టిందీ చిత్రం.

తెలుగు రాష్ట్రాల వరకు ‘యశోద’ షేర్ రూ.5 కోట్ల మార్కును దాటింది. యుఎస్‌లో ఈ చిత్రం 4 లక్షల డాలర్ల మార్కుకు చేరువగా వెళ్తోంది. బాక్సాఫీస్ చాలా డల్లుగా ఉన్న టైంలో ఇలాంటి టాక్‌తో ఈ వసూళ్లు రాబట్టడం చిన్న విషయం కాదు. ఇది సమంత స్టార్ పవర్‌ను సూచించేదే. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ ఆమే అనడంలో సందేహం లేదు. సినిమాను కూడా ఆమే తన భుజాల మోసిందనడంలో అతిశయోక్తి లేదు.

This post was last modified on November 14, 2022 6:47 pm

Share

Recent Posts

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

1 hour ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

6 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

7 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

7 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

7 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

10 hours ago