ఈ రోజుల్లో తమ అభిమానులను సంతృప్తి పరచడం హీరోలకు పెద్ద టాస్క్‌గా మారిపోయింది. అంటే కేవలం మంచి సినిమాలు తీసి వారిని ఎంటర్టైన్ చేయడం మాత్రమే కాదు.. సినిమా మొదలైన దగ్గర్నుంచి సమయానుకూలంగా అప్‌డేట్స్ ఇస్తుండాలి.. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లాంటి వాటితో వారిని మెప్పించాలి. సినిమాను బాగా ప్రమోట్ చేసి హైప్ పెంచాలి. ఇవి చేయకపోతే అభిమానులకు కోపం వచ్చేస్తుంది.
తమ అభిమాన హీరోల సినిమాల విషయంలో ఇలాంటివి పాటించకపోతే ప్రొడక్షన్ హౌస్‌లకు వ్యతిరేకంగా ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో నిరసన తెలియజేస్తున్న ఉదంతాలు చూస్తున్నాం. సాహో సినిమా విషయంలో యువి క్రియేషన్స్ మరీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలోనే గొడవ చేశారు యువి ఆఫీస్ ముందు. ఇక ఆన్ లైన్ ఉద్యమాల సంగతి అయితే సరేసరి.
ఐతే ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు ప్రభాస్ ఫ్యాన్స్‌ను అనుకరించే ప్రయత్నం చేశారు. పుష్ప-2 సినిమాకు సంబంధించి తమకు అప్‌డేట్ కావాలంటూ ఒక పదిమంది గుమిగూడి గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు గొడవ చేశారు. ఐతే ఇదంతా కూడా పీఆర్ స్టంటులాగా అనిపించింది తప్ప.. ఒరిజినాలిటీ కనిపించట్లేదన్నది సోషల్ మీడియా టాక్. అయినా పుష్ప-2 సినిమాను నిర్మిస్తోంది మైత్రీ మూవీస్. ఈ సినిమా గురించి ఇటీవలే ఊర్వశివో రాక్షసివో సక్సెస్ మీట్లో బన్నీ మాట్లాడాడు. త్వరలోనే అప్‌డేట్ ఉంటుందన్న సంకేతాలు ఇచ్చాడు.
ఇక సినిమా షూట్ ఇటీవలే మొదలు కావడం, టీజర్ కంటెంట్ రెడీ చేయడం గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. డిసెంబరు 16న రిలీజవుతున్న అవతార్-2 సినిమా థియేటర్లలో దీన్ని ప్రదర్శించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదంతా తెలిసి కూడా అప్‌డేట్ కావాలంటూ ఊరికే హంగామా చేయడం ఏంటో అర్థం కావడం లేదు. బన్నీ క్రేజ్ చూపించడానికి పీఆర్ టీం ఈ స్టంట్ చేయించిందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.
This post was last modified on November 14, 2022 6:57 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…