జూనియర్ ఎన్టీఆర్ కి తెలుగులోనే కాదు అంతే పట్టు కన్నడ భాషమీద కూడా ఉంది. తల్లి స్వంత ఊరు అదే రాష్ట్రం కావడంతో సహజంగానే అక్కడి లాంగ్వేజ్ మీద గ్రిప్పు సాధించాడు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో, దానికి స్వంత డబ్బింగ్ ఇవ్వడంలో తారక్ చూపించిన శ్రద్ధకు శాండల్ వుడ్ మీడియా సైతం మంచి సపోర్ట్ ఇచ్చింది. ఈ అంశాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తనకు సానుకూలంగా మార్చుకోబోతున్నాడు.
త్వరలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ ప్యాన్ ఇండియా మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే దానికన్నా ముందు సలార్ పూర్తవ్వాలి. ఇటువైపు కొరటాల శివ సినిమా ఫినిష్ చేయాలి. ఎంతలేదన్నా ఆరేడు నెలలు పడుతుంది. ఎలాగూ జూనియర్ కు కన్నడ బాగా వస్తుంది కాబట్టి సలార్, కెజిఎఫ్ లా కాకుండా ఈసారి ద్విభాషా చిత్రాన్ని ప్లాన్ చేయబోతున్నట్టు తెలిసింది. అంటే డబ్బింగ్ ఉండదు. ఒకే సీన్ ని రెండు భాషల్లో తీస్తారు.
ఆర్టిస్టుల్లో కొద్దిగా మార్పు ఉండొచ్చు కానీ హీరో మాత్రం అదే సన్నివేశం మళ్ళీ మళ్ళీ పెర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. మహేష్ బాబు స్పైడర్, శర్వానంద్ ఒకే ఒక జీవితం ఈ తరహాలో తెరకెక్కినవే. అందుకే మెయిన్ క్యాస్టింగ్ లో తేడాలను స్పష్టంగా చూడొచ్చు. ఇప్పుడు తన మూవీని కూడా తెలుగు కన్నడలో తీసి హిందీతో సహా ఇతర భాషల్లో డబ్బింగ్ చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. తారక్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందే ఈ సినిమాకు సంబంధించి స్టోరీ ఇప్పటికే ఫైనల్ అయ్యిందని బెంగళూరు టాక్.
కానీ డైలాగ్ వెర్షన్ కి టైం పడుతుంది. సలార్ పనుల్లో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నాడు. 2023 సమ్మర్ కంతా ఫస్ట్ కాపీ సిద్ధం చేసి జూనియర్ తో చేతులు కలపబోతున్నాడు. హీరోయిన్ తో సహా క్యాస్టింగ్ ఆ టైంకంతా లాక్ చేసేయాలి. కొరటాల ప్రాజెక్టుకి ఇది ఎంత పెద్ద సమస్యగా మారిందో చూసిన నేపథ్యంలో అలా జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు. కెజిఎఫ్ దర్శకుడి చేతిలో తమ హీరోని ఏ రేంజ్ ఓ చూపిస్తాడనే అంచనాలు ఫ్యాన్స్ లో మాములుగా లేవు.
This post was last modified on November 13, 2022 6:15 pm
అనుకున్నంతా అయ్యింది. అధికార పార్టీ టీడీపీ వ్యూహాల ముందు విపక్ష వైసీపీ వ్యూహాలు ఫలించలేదు. రాజకీయాలకు కొత్తే అయినా గుంటూరు…
పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తినిపించడం ఈ రోజుల్లో పెద్ద సవాళుగా మారింది. తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, పిల్లలు తమ…
రాజకీయ సన్యాసం తీసుకున్న వైసీపీ మాజీ విజయసాయిరెడ్డికి సంబంధించిన రహస్యాలు ఒక్కొక్కటిగానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఓ విషయం…
ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు…
భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే కొత్త యాప్‌ను ప్రారంభించింది. ‘స్వరైల్…